Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిలేశ‌పురం వాట‌ర్ ఫాల్స్ వ‌ద్ద బెజ‌వాడ గ్యాంగ్ వార్!

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (11:56 IST)
బెజ‌వాడ‌లో గ్యాంగ్ వార్ సంస్కృతి త‌ర‌చూ త‌లెత్తి చూస్తోంది. గ‌త ఏడాది జూన్ లో ప‌ట‌మ‌ట‌లో పండు గ్యాంగ్ వార్ సంఘ‌ట‌న న‌గ‌ర‌వాసుల‌నే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. సందీప్ అనే యువ‌కుడిని పండు గ్యాంగ్ వార్ లో కొట్టి చంపారు. అప్ప‌ట్లో మ‌ణికంఠ అలియాస్ పండు వికృత చేష్టలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. అందరి వెన్నులో చ‌లిపుట్టించాయి.
 
ఇపుడు తాజాగా విజ‌య‌వాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్ సంఘటన హల్చల్ క‌లిగిస్తోంది. కొండ‌ప‌ల్లి వ‌ద్ద కిలేశ‌పురంలోని వాటర్ ఫాల్స్ చూడ‌టానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అక్క‌డికి వ‌చ్చి ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ, సేద‌తీరాల్సిన యువ‌కులు... త‌మ‌లోతాము గొడ‌వ‌ప‌డి కొట్టుకున్నారు. దొమ్మిలా ఒకరిపై ఒక‌రు ప‌డి త‌న్నుకు చ‌చ్చారు. 
 
కిలేశ‌పురం వాట‌ర్ ఫాల్స్ చూడటానికి విజ‌య‌వాడ నుంచి వ‌చ్చిన యువ‌కులు చివ‌రికి త‌మ మ‌ధ్య జరిగిన గొడవ ఆధారంగా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. అక్క‌డే ఉన్న క‌ర్ర‌లు, బాదుల‌తో కొట్టుకోవ‌డంతో వాట‌ర్ ఫాల్స్ వ‌ద్ద ర‌ణ‌రంగ‌మే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ కొట్లాట‌లో చాలా మందికి గాయాలు కాతా, ఒక యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

ఈ గొడ‌వ ప‌డిన గ్యాంగ్ విజయవాడ యువకులే అని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు చెపుతున్నారు. గ్యాంగ్ వార్‌లో గాయపడిన ఒక యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇబ్ర‌హీంప‌ట్నం పోలీసులు ఈ గ్యాంగ్ వార్ సంఘ‌ట‌న‌పై విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments