Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుషికొండ వెంక‌న్న ఆలయం, ఆగ‌స్టు 13న సీఎంతో ప్రారంభం

Advertiesment
Rushikonda
, సోమవారం, 2 ఆగస్టు 2021 (11:16 IST)
విశాఖ సాగ‌ర‌తీరాన‌ రుషికొండ బీచ్‌లో ఈ ఆల‌యం వైభ‌వం... అబ్బో చెప్పన‌ల‌వి కాదు. అదే శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌యం. అంద‌రూ ఎపుడెపుడా అని ఆర్తిగా ఎదురుచూస్తున్న విశాఖ టిటిడి శ్రీ వెంకటేశ్వర ఆలయం ఈ ఆగ‌స్టు 13న భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌లిగించ‌నుంది.
 
విశాఖ‌లోని రుషికొండ బీచ్ ముందు నిర్మించిన ఈ వేంక‌టేశ్వ ఆల‌యాన్ని ఆగస్టు 13 న వేద‌మంత్రోచ్ఛ‌ర‌ణ‌తో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. రుషికొండ బీచ్‌లోని గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ - గీతం మధ్య కొండపై ఈ వేంక‌టేశ్వ‌రుడు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నాడు.

తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఈ ఆలయ నిర్మాణ పనులు పూర్త‌వుతున్నాయి. 2018 లో సుమారు 10 ఎకరాల స్థ‌లంలో 26 కోట్ల రూపాయ‌ల‌తో ఈ ఆల‌య నిర్మాణం ప్రారంభించారు. విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, అంకురార్పణం ఆగస్టు 9 నుండి 13 వరకు నిర్వ‌హిస్తారు. 
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 13 న ఈ వెంక‌న్న ఆల‌యాన్ని సంద‌ర్శించి, ప్రారంభోత్సం చేస్తార‌ని భావిస్తున్నారు. ఆగస్టు 13 తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. తిరుపతి నుండి వచ్చే పూజారులు ఒక వారం పాటు వైజాగ్‌లో పర్యటించి, అవసరమైన  ఆచారాలను నిర్వహిస్తారు.
 
వైజాగ్‌లో టిటిడి చేపట్టిన ఆలయ రూపకల్పన, ప్ర‌ణాళిక తిరుపతిలో టిటిడి దేవాలయం మాదిరిగానే కొన్ని లక్షణాలను జోడించింది. తిరుపతి ప్రధాన దేవాలయంలోని విగ్రహం మాదిరిగానే హనుమంతుని విగ్రహం కూడా వెంకటేశ్వర విగ్రహం ముందు ఉంటుంది. అలాగే, ప్రధాన దేవాలయం పక్కన భూదేవి, శ్రీదేవి దేవాలయాలు ఉంటాయి.

శ్రీవారి పాదాలు సహా అన్ని ఇతర దేవతల అంశాలు తిరుపతిలో ఎస్.వి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ (SVITSA) లో చెక్కబడ్డాయి. ఈ టీటీడీ  ఆలయంలో దాదాపు 150 మంది సభ్యులు ఉండే ఒక ధ్యాన మందిరం, వివాహ వేడుకలను నిర్వహించడానికి ఒక విందు హాల్ కూడా నిర్మించారు. అలాగే, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఒక కాటేజీ సౌకర్యం క‌ల్పించారు. 
 
ఆలయం వెలుపల ప్రత్యేక టికెట్ కౌంటర్, ప్రసాదం కౌంటర్ అందుబాటులో ఉంటాయి. ఈ దేవాలయంలో ఇద్దరు ప్రధాన పూజారులు ఉంటారు. దేవాలయం సమీపంలో వారికి వసతి సౌకర్యం కల్పించారు. భక్తులు ఆలయాన్ని సందర్శించడానికి, టీటీడీ బీచ్ రోడ్డు నుండి ఆలయం వరకు 500 మీటర్ల ఘాట్ రోడ్డును నిర్మించారు. టిటిడి అధికారులు ఈ ఆల‌య ప్రారంభోత్సవం తర్వాత తిరుమలలో నిర్వహించే అన్ని ఆచారాలను ఇక్క‌డ నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళితుల్లో పేదరికం రూపుమాపే లక్ష్యంగా 16 నుంచి దళితబంధు