Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిక్రిష్ణ మరణం నవ్వు తెప్పిస్తోంది - బాలక్రిష్ణ సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (14:36 IST)
నందమూరి బాలక్రిష్ణ మరోసారి తెలిసీ తెలియక చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. అది కూడా తన అన్న హరిక్రిష్ణ మరణంపై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారితీస్తోంది. రోడ్డుప్రమాదంలో హరిక్రిష్ణ మరణించిన తరువాత ఒక్కసారి నందమూరి కుటుంబం విషాధాల్లోకి వెళ్ళిపోయింది. నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న హరిక్రిష్ణ మరణించడంతో కొన్నిరోజుల పాటు ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
 
కానీ తాజాగా హరిక్రిష్ణ మరణంపై బాలక్రిష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసిని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా సుహాసిని బాలక్రిష్ణను వెంట పెట్టుకుని నందమూరి ఘాట్ వద్దకు వెళ్ళింది. అయితే అక్కడ మీడియాతో మాట్లాడిన బాలక్రిష్ణ హరిక్రిష్ణ మరణం తీరని లోటని చెప్పాల్సింది పోయి హరిక్రిష్ణ మరణం సంభ్రమాశ్చర్యంలోకి మమ్మల్ని పడేసింది అన్నారు. 
 
దీని అర్థం కావాల్సినంత ఆనందమని. దీంతో ఒక్కసారిగా హరిక్రిష్ణ కుమార్తె సుహాసిని ఆశ్చర్యపోయారు. బాలక్రిష్ణకు ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయారు. బాలక్రిష్ణ తెలిసి మాట్లాడారో..తెలియక మాట్లాడారో తెలియక టిడిపి నేతలు ఆలోచనలో పడ్డారు. కానీ గతంలో కూడా బాలక్రిష్ణ ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments