Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి ఆస్తి వివరాలు... ఆస్తి విలువ రూ.కోటి.. అప్పులు కోటి

Advertiesment
Telangana assembly elections
, ఆదివారం, 18 నవంబరు 2018 (10:40 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా సినీ నటుడు దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసిని పోటీ చేస్తున్నారు. ఆమె శనివారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తనతో పాటు తన భర్త, కుమారుడు ఆస్తి వివరాలను ఆమె వెల్లడించారు. ముసాపేట జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆమె బయోడేటా వివరాలను పరిశీలిస్తే...
 
పూర్తి పేరు : నందమూరి వెంకట సుహాసిని
తండ్రి పేరు : నందమూరి హరికృష్ణ (లేట్)
విద్యాభ్యాసం : ఎల్.ఎల్.బి (1999), పెందెకంటి న్యాయ కాలేజీ, హైదరాబాద్
ఆదాయం : గృహాల అద్దెలు
వృత్తి : సోషల్ యాక్టివిటీస్
భర్త పేరు : చుండ్రు వెంకట శ్రీకాంత్
కుమారుడు: చుండ్రు వెంకట శ్రీహర్ష
2018-19లో వార్షిక ఆదాయ పన్ను రిటర్న్ : 10,53,300/-
చేతిలో ఉన్న నగదు నిల్వ : 1,50,000
భర్త వద్ద ఉన్న నగదు నిల్వ : రూ.2 లక్షలు
కుమారుడు వద్ద ఉన్న నగదు : రూ.లక్ష
కారు : రూ.15 లక్షల విలువ చేసే హ్యూండాయ కార్.
బంగారం : రూ.71 లక్షల విలువ చేసే 2.2 కేజీల బంగారం
వజ్రాలు విలువ : రూ.30 లక్షలు
వెండి : రూ.31 లక్షలు విలువ చేసే 81 కేజీల వెండి
మొత్తం ఆస్తుల విలువ : రూ.1,52,41,493
భర్త ఆస్తుల విలువ : రూ.7 లక్షలు 
కుమారుడు ఆస్తుల విలువ : రూ.1,02,60,000
అప్పు : రూ.1,46,28,246
 
స్థిరాస్తులు 
ఫిల్మ్ నగర్‌లో రూ.4.30 కోట్లు, విలువైన 450 గజాల స్థలంలో ఇల్లు. భర్తకి తూర్పుగోదావరి జిల్లాలోని కొమరగిలో రూ.65 లక్షల విలువైన 3.20 ఎకరాలు భూమి ఉంది.
 
కుమారుడుకి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో రూ.88.38 లక్షల విలువైన 2455 గజలా స్థలం ఉంది. 
 
షేర్లు : కుటుంబ సభ్యులకు మిక్ ఎలక్ట్రానిక్స్, శ్రీభవాని క్యాస్టింగ్ లిమిటెడ్ కంపెనీల్లో ప్రస్తుత విలువ ప్రకారం రూ.5.50 లక్షల విలువైన షేర్లు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమల ఎంట్రీ ముఖ్యంకాదు.. లైంగిక వేధింపులను అడ్డుకోండి : తస్లీమా నస్రీన్