Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికలు : పవన్ కళ్యాణ్ నిర్ణయంపై ఉత్కంఠ...

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (14:29 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రభావం చూపనున్నారు. ఆయనకు తెలంగాణాలో అభిమానులు మెండు. దీంతో ఆయన ఎవరికి మద్దతిస్తారన్న అంశంపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికలు ఇవి. తొలి ఎన్నికల్లో తెరాస విజయబావుటా ఎగురవేసింది. ఇపుడు మరో యేడాది అధికారం ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సై అంది. ఇపుడు కేసీఆర్‌తోపాటు ఆయన పార్టీని చిత్తుగా ఓడించాలన్న గట్టిపట్టుదలతో విపక్ష పార్టీలన్నీ ఉన్నాయి. ఇందుకోసం మహాకూటమిగా ఏర్పడి ముందుకుసాగుతున్నాయి. 
 
ఈ ఎన్నికల్లో గెలుపుపై ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోట్లాది మంది అభిమానులను కలిగిన పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 
 
ఆయన ఏ పార్టీకైనా మద్దతిస్తారా? లేక తటస్థంగా ఉండిపోతారా? ఒకవేళ మద్దతు ఇస్తే ఏ పార్టీకి ఇస్తారు? అనేది ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్‌తో పవన్ ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కేసీఆర్‌కు అండగా నిలిచి తెరాస అభ్యర్థులకు మద్దతునిస్తారని పెక్కుమంది భావిస్తున్నారు. అయితే, పవన్ మాత్రం తన నిర్ణయాన్ని ఈనెల 17వ తేదీన వెల్లడించనున్నారు. 
 
కాగా, ఉన్నఫళంగా తెలంగాణకు అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావడం, తగినంత సమయం లేకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ బలంగా లేకపోవడం వంటి పలు కారణాల కారణంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఎన్నికలకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. కానీ, వచ్చే యేడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రం నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments