Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో హీరోయిన్లు వీరే...

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (08:25 IST)
వృత్తికే అంకితమైన విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కొనియాడింది. ఇలాంటివారిని ఏపీ పోలీస్ శాఖ హీరోయిన్లుగా పోల్చింది. ఈ మేరకు ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 
 
తిరుపతి కేంద్రం సోమవారం నుంచి రాష్ట్రంలో మహిళల రక్షణ, సైబర్ భద్రత అంశాలపై పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆసక్తికర పోస్టు చేసింది.
 
'ప్రతి మహారాణి కిరీటం ధరించకపోవచ్చు, రాచరిక దుస్తుల్లో కనిపించకపోవచ్చు... కానీ కొందరు మహారాణులు టోపీలు పెట్టుకుంటారు, యూనిఫాం ధరిస్తారు. వీళ్లే మా హీరోయిన్లు... అత్యుత్తమ మహిళా పోలీసాఫీసర్లు' అంటూ కామెంట్ చేసింది. 
 
ఈ వ్యాఖ్యలకు తగిన విధంగా కొందరు మహిళా పోలీస్ అధికారుల గ్రూప్ ఫొటోను కూడా పంచుకుంది. వృత్తికే అంకితమై విధులు నిర్వర్తిస్తున్న అధికారిణులు అంటూ ఏపీ పోలీస్ విభాగం కొనియాడింది. ఏపీ పోలీస్ ఎంతో భద్రమైన సేవలు అందిస్తూ, గర్వించదగ్గ రీతిలో పనిచేస్తుందని ఆ పోస్టులో పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments