Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌ను టాలీవుడ్ ఎత్తుకుపోతుందేమో.. మీరు ఆడుకోవడానికి నేనే దొరికానా?

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (09:44 IST)
KTR
తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై.. ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కనుక కెమెరా ముందుకు వస్తే టాలీవుడ్‌ చూస్తూ ఊరుకోదని అన్నారు. తిరుగులేని బ్రాండ్‌ అంబాసిడర్‌ కేటీఆర్ అంటూ పొగడ్తలు కురిపించారు. 
 
వివరాల్లోకి వెళితే... జహీరాబాద్‌లోని ప్లాంట్‌లో మహీంద్రా సంస్థ ఉత్పత్తి చేసిన 3,00,001వ ట్రాక్టర్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్‌పై కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఆ ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
 
అంతేగాకుండా ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి కామెంట్లు చేశారు. "ఆనంద్ మహీంద్రా గారూ చూడండి.. నేను మీ ఉత్పత్తులకు ఫోజులిస్తూ, మార్కెటింగ్ చేయడం కోసం ఎలా ప్రచారం కల్పిస్తున్నానో.. మీరు మా రాష్ట్రానికి మరింత వ్యాపారాన్ని తీసుకురావాల్సి రావచ్చు" అంటూ కేటీఆర్ చమత్కరించారు. 
anand mahindra
 
కేటీఆర్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. "మీరొక అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆకాశాన్నంటుతున్న టాలీవుడ్ సామ్రాజ్యం మిమ్మల్ని ఎత్తుకుపోతుందేమోనన్నదే నా భయం" అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దానికి నవ్వుతూ ఉన్న ఎమోజీని జత చేశారు.
 
కేటీఆర్ దీనికి మళ్లీ బదులిస్తూ.. "సార్‌.. మీరు ఆడుకోవడానికి నేనే దొరికానా?" అనే అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్‌ చేశారు. స్మైలీ ఎమోజీని జత చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments