Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలనాథులపై శివసేన ఆగ్రహం... విర్రవీగితే.. వాత పెడతారు!

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (10:59 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దరిమిలా బీజేపీపై మిత్రపక్షం శివసేన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. అధికారంలో ఉన్న నాయకులు అహంకారంతో వ్యవహరించినందుకు ప్రజలు కీలెరిగి వాత పెట్టారంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికల ముందు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో చేపట్టిన మహా జనదేశ్ యాత్ర ప్రభావమేదీ లేదని తేల్చింది. ఈ ఎన్నికల్లో కూటమికి 200కు పైగా స్థానాలు వస్తాయన్న ఫడ్నవీస్ అంచనాలు తలకిందులయ్యాయని పేర్కొంది. 
 
ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో బీజేపీపై విమర్శలు గుప్పించింది. విపక్షాల్లో చీలికలతో ఎన్నికల్లో గెలువలేరని స్పష్టమైందని పేర్కొంది. ఎన్నికల ముందు శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీని బీజేపీ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని తెలిపింది.

అయితే, 50 సీట్లకు పైగా గెలుచుకుని ఎన్సీపీ తమ బలం పెరిగిందని నిరూపించుకుందని, సరైన నాయకత్వంలేని కాంగ్రెస్ సైతం 44 స్థానాలు గెలుచుకుని తన సత్తా చూపిందన్నది. పార్టీల ఫిరాయింపులు, విపక్షాల్లో చీలికలతో ఎన్నికల్లో విజయం సాధించవచ్చని బీజేపీ భావించింది.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments