Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

29 ఏళ్లకే సీఎం పదవిని చేపట్టనున్న శివసేన 'యంగ్ టైగర్' ఆదిత్య ఠాక్రే

29 ఏళ్లకే సీఎం పదవిని చేపట్టనున్న శివసేన 'యంగ్ టైగర్' ఆదిత్య ఠాక్రే
, శుక్రవారం, 25 అక్టోబరు 2019 (11:43 IST)
మహారాష్ట్రకు శివసేన నుంచి అతి పిన్నవయసులోనే యంగ్ టైగర్ ఆదిత్య ఠాక్రే సీఎం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి కారణం బీజేపీ హవా తగ్గడమే. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ కాస్త వెనక్కి తగ్గిందనే చెప్పాలి. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి 105 స్థానాలకే పరిమితమైంది. శివసేన తాజా ఎన్నికల్లో 56 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో శివసేన శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు శివసేన ప్రయత్నాలు చేస్తోంది.
 
సీఎం పదవీ కాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీకి శివసేన ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. తొలి అవకాశం తమకే ఇవ్వాలని కూడా శివసేన కోరినట్లు తెలిసింది. ఆదిత్య ఠాక్రేను సీఎం చేయాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు శివసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఠాక్రే కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఈసారి బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే 70 వేల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఇంకోవైపు భాజపాకు స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇక శివసేన దిక్కయ్యింది. ఈ నేపధ్యంలో 50-50 లెక్క ప్రకారం రెండున్నరేళ్లు శివసేన- మరో రెండున్నరేళ్లు భాజపా అధికారాన్ని పంచుకుంటాయన్న ప్రచారం జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతిపై మీ వైఖరేంటి, హైకోర్టులో కప్పు టీ కూడా దొరకడం లేదు - ప్రెస్‌రివ్యూ