Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ModixijinpingMeet మహాబలిపురాన్ని ఇందుకే ఎంపిక చేశారట....

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (09:49 IST)
భారత్‌లోని సర్వాంగసుందరంగా ఉండే సముద్రతీర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిలో మహాబలిపురం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర రాజధాని చెన్నైకు సమీపంలో ఉంది. అయితే, ఇలాంటి పర్యాటక ప్రాంతాలు, నగరాలు భారత్‌లో ఎన్నో ఉన్నాయి. కానీ, భారత్ - చైనా దేశాధినేతల భేటీకి మహాబలపురాన్ని మాత్రమే ఎంపిక చేశారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
దాదాపు 1200 సంవత్సరాల క్రితం... అంటే 7, 8 శతాబ్దాల సమయంలో మహాబలిపురాన్ని పల్లవ రాజులు ఎంతో అద్భుతంగా పాలించారు. తీర్చిదిద్దారు దీన్ని ఓ మహానగరంగా మార్చారు. ఈ నగరానికి, చైనాకు ఓ చారిత్రక అనుబంధం ఉంది. మూడో పల్లవరాజు కుమార విష్ణువు ఎన్నో యుద్ధ విద్యల్లో, వైద్య కళల్లో నిష్ణాతుడు. ఆయన బౌద్ధమతం స్వీకరించి, ఓ పని నిమిత్తం చైనాకు వెళ్లిపోయి అక్కడే ఉండిపోతాడు. చైనాలో ఆయన బోధి ధర్ముడుగా మారిపోయారు. 
 
చైనాలో బోధి ధర్ముడు ఎంతో ఆరాధ్యుడు. అక్కడి ప్రజలు నిత్యమూ ఆయన్ను పూజిస్తుంటారు. ఈ కారణం చేతనే తమకు ఆరాధ్యుడైన కుమార విష్ణువు నడయాడిన ప్రాంతాన్ని తిలకించాలని భావించిన జిన్ పింగ్, మహాబలిపురాన్ని ఎంచుకున్నారు. కాగా, బోధి ధర్ముడి కథపై ఆ మధ్య సూర్య, శ్రుతి హాసన్ జంటగా ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments