Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RIPDisha ఆరంభించిన చోటే ముగించిన పోలీసులు.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (09:17 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశువైద్యురాలు దిశ అత్యాచార, హత్య కేసులో అరెస్టు చేసిన నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను కాల్చి చంపిన స్థలంలోనే కామాంధులు ఎన్‌కౌంటర్ గురయ్యారు. 
 
దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ సంఘటన స్థలంలోనే కరడుకట్టిన కామాంధులైన ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన సంచలనం రేపింది. వీరి ఎన్‌కౌంటర్‌తో ‘దిశ’కు ఆత్మశాంతి లభించిందని పలువురు మహిళా నేతలు వ్యాఖ్యానించారు. 
 
‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments