సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసల బస్తీలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. గత కొద్దికాలంగా భార్గవ్ అనే వ్యక్తి ఇంట్లో పని మనిషిగా ఓ అమ్మాయి చేరింది. భార్గవ్ భార్య ప్రసవానికి అమ్మ వారి ఇంటికి వెళ్లడంతో ఎవరు లేని సమయం చూసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భార్గవ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన జరిగి రెండుమూడు రోజులు అవుతున్నా విషయం బయటకు రాకుండా గుట్టుచప్పుడుగా ఉంచేందుకు అమ్మాయి తల్లిదండ్రులతో మంతనాలు జరుపుతున్నారు బస్తీ పెద్దమనుషులు.