బంజారా హిల్స్ రోడ్ నెంబర్.3లో అమానుషం జరిగింది. షౌకత్ నగర్‌కి చెందిన ఓ యువతి ఇంట్లో స్నానం చేస్తుండగా, బాత్రూం కిటికీలో నుంచి ఓ వ్యక్తి తన సెల్ ఫోన్‌తో వీడియో చిత్రీకరణ చేశాడు.
గమనించిన బాధిత యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.