కోజికోడ్ విమాన ప్రమాదం, 10 మంది మృతి, కారణం అదే- video

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (22:11 IST)
విదేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను వందేభార‌త్ మిష‌న్ ద్వారా ప్ర‌త్యేక విమానాల్లో స్వ‌దేశానికి భారత ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ మిష‌న్‌లో భాగంగా.. దుబాయ్ నుంచి కోజికోడ్ వ‌చ్చిన ఎయిరిండియా విమానం ప్ర‌మాదానికి గురైంది.
 
దుబాయ్ నుంచి వ‌చ్చిన ఎయిరిండియాకు చెందిన IX-1344 విమానం.. కోజికోడ్‌ ఎయిర్‌పోర్ట్ వద్ద రాత్రి 7:41 గంట‌ల స‌మ‌యంలో ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతోన్న స‌మ‌యంలో రన్‌వే నుంచి విమానం పక్కకు జరిగింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. విమానం రెండు ముక్క‌లైపోయింది.
 
ఈ విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా మొత్తం 191 మంది ఉన్న‌ట్టుగా చెబుతున్నారు. భారీ వర్షం కురుస్తున్న స‌మ‌యంలో విజిబులిటీ త‌క్కువ‌గా ఉండ‌టంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టుగా భావిస్తున్నారు. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఇద్దరు చిన్నారులతో సహా 10 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందినవారిలో పైల‌ట్ కూడా వున్నట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం ఇంకా పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments