Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైస్ జెట్‌ ఫ్లైట్‌ను గగనంలో నిలువరించిన పాక్ ఎఫ్-16.. భీతావహులైన ప్రయాణికులు

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (17:26 IST)
స్పైస్ జెట్ విమానాన్ని పాకిస్థాన్ యుద్ధ విమానాలు వెంటాడాయి. దీంతో విమాన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటన గురువారం జరిగింది. ఢిల్లీ నుంచి ఆప్ఘనిస్థాన్‌కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానానికి ఈ పరిస్థతి ఏదురైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీ నుంచి కాబూల్‌కు స్పైస్ జెట్ విమానం ఒకటి బయలుదేరింది. ఈ విమానాన్ని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు చుట్టుముట్టి గగనంలోనే అడ్డుకున్నాయి. బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత తన గగనతలాన్ని మూసివేసిన పాక్ ఇటీవలే తెరిచింది. ఈ క్రమంలో స్పైస్ జెట్ విమానం ప్రయాణిస్తుండగా దాన్ని భారత యుద్ధ విమానంగా పొరబడిన పాక్ వాయుసేన వెంటనే స్పందించింది. 
 
"పాక్ వాయుసేనకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ఆ స్పైస్ జెట్ విమానాన్ని చుట్టుముట్టాయి. ఎత్తు తగ్గించాల్సిందిగా స్పైస్ జెట్ పైలెట్‌కు ఓ పాక్ ఫైటర్ పైలెట్ చేతితో సంజ్ఞలు చేసినట్టు విమాన ప్రయాణికులు తెలిపారు. ఆపై పైలెట్‌తో రేడియో ద్వారా సంభాషించి అది ప్రయాణికుల విమానం అని పాక్ పైలెట్లు తెలుసుకున్నారు. ఆ విమానం పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులు దాటిన తర్వాతే పాక్ ఎఫ్-16లు వెనుదిరిగాయి. ఉన్నట్టుండి గాల్లో యుద్ధ విమానాలు రౌండప్ చేయడంతో స్పైస్ జెట్ ప్రయాణికులు భీతావహులైపోయారు
 
మరోవైపు, విమానం కాబూల్ చేరిన తర్వాత పాకిస్థాన్ రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం స్పైస్ జెట్ విమానం ఢిల్లీకి ఐదు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. వాస్తవానికి ప్రతి విమానంపైనా అది ఏ తరహా విమానమో కోడ్ భాషలో రాసి ఉంటుంది. దీన్ని పాక్ వాయుసేన అర్థం చేసుకోవడంలో పొరబడిన కారణంగానే గగనతలంలో ఈ తప్పు జరిగినట్టు వివరించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments