దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు సమాచారం. దీన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఢిల్లీలో పెద్దఎత్తున దాడులు చేసేందుకు ఐదుగురు ఐదుగురు ఉగ్రవాదులు నేపాల్ గుండా భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఉగ్రవాదుల మధ్య సమాచారాన్ని ఇంటలిజెన్స్ అధికారులు ఛేదించారు. ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతం గోరఖ్‌పూర్ వీరి చివరి సమాచార ప్రాంతంగా గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించారు.
ముఖ్యంగా, ఈ నెలాఖరులో ఢిల్లీలో దీపావళి పండుగకు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాడికి సహాయంగా కాశ్మీర్ నుంచి పలువురు వచ్చి ఢిల్లీలో వీరిని కలువనున్నట్లుగా ఉగ్రవాదుల సమాచారాన్ని బట్టి తెలుస్తోందన్నారు.