Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌రుణ్ భాస్క‌ర్ కొత్త అవ‌తారం..?

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (15:36 IST)
పెళ్లి చూపులు సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారి తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ఆత‌ర్వాత ఈ న‌గ‌రానికి ఏమైంది అనే సినిమా చేసాడు. ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేదు. ఆత‌ర్వాత వెంకీతో సినిమా చేయ‌నున్నాడు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. వెంకి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌కుండానే త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా అవ‌తారం ఎత్తాడు.
 
ఇదిలా ఉంటే.. సాయి రొనాక్‌, ప్రీతి అష్రాని జంటగా నటిస్తున్న చిత్రం ప్రెజర్‌ కుక్కర్. కరంపూరి క్రియేషన్స్‌ అండ్‌ మిక్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుజై, సుశీల్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ ప్రెజర్‌ కుక్కర్ సినిమా ఫస్ట్‌ లుక్‌‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
 
ఇప్పటికే హీరోగా మారిన తరుణ్ భాస్కర్ ఈ సినిమా కోసం ఎడిటర్‌గా మారుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తరుణ్ భాస్కర్ కట్ చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్‌గా ఓ వీడియోను విడుదల చేసింది. 
 
ఈ వీడియోలో ఈ చిత్ర టీజర్‌ను ఎందుకు కట్ చేయాలని అనిపించిందో తరుణ్ భాస్కర్ తెలిపారు. ఇంకా అతనితో పాటు అతని పెంపుడు కుక్క కూడా ఈ టీజర్ ఎడిట్‌లో భాగమవుతుందని, టీజర్ నచ్చితే అందరూ షేర్ చేసి లైక్ చేయమని తరుణ్ ఈ వీడియోలో తెలిపారు. మ‌రి.. త‌రుణ్ భాస్క‌ర్ ఎడిట‌ర్‌గా క‌ట్ చేసిన టీజ‌ర్ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments