తరుణ్ భాస్కర్ ప్రియురాలు అనసూయ? నిజమేనా?

గురువారం, 31 జనవరి 2019 (15:13 IST)
'రంగమ్మత్త'గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న బుల్లితెర యాంకర్ అనసూయ. ఒకవైపు బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు... వెండితెరపై సత్తా చాటుతోంది. హీరో రామ్ చరణ్ నటించిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. 
 
ఇపుడు మరో చిత్రంలో నటించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుందట. సంచలన హీరో విజయ్ దేవరకొండ తనను 'పెళ్లి చూపులు' సినిమా ద్వారా హీరోగా మార్చిన తరుణ్ భాస్కర్‌ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను భుజానికెత్తుకున్న విషయం తెలిసిందే.
 
ఇందుకోసం విజయ్ దేవరకొండ నిర్మాతగా మారారు. కింగ్ ఆఫ్ హిల్ అనే పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించాడు. ఈ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ తెరకెక్కించే చిత్రంలో హీరోయిన్‌గా అనసూయను ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం 'కథనం' మూవీ షూటింగ్‌లో ఉన్న అనసూయ... విజయ్ దేవరకొండ సినిమా విషయమై స్పందించింది. తను తరుణ్‌కి లవర్‌ని కానని.. ఈ చిత్రంలో కీలక పాత్ర మాత్రం పోషిస్తున్నానని అనసూయ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇళయరాజా 75.. కోర్టుకెక్కింది..