Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌న తాత‌లాంటి సినిమాల‌ను వేరే భాష‌ల్లో చేస్తున్నారు... త‌రుణ్ భాస్క‌ర్ ఫైర్.. ఏమైంది..?

Advertiesment
మ‌న తాత‌లాంటి సినిమాల‌ను వేరే భాష‌ల్లో చేస్తున్నారు... త‌రుణ్ భాస్క‌ర్ ఫైర్.. ఏమైంది..?
, శుక్రవారం, 31 మే 2019 (20:41 IST)
మ‌ల్లేశం సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే చాలా ప్రేమ‌తో సినిమా చేసిన‌ట్లుగా అనిపించింది. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంత ప్యాష‌నేట్‌గా సినిమా చేశారో చూస్తేనే అర్థ‌మైపోతుంది అని ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ అన్నారు. మ‌ల్లేశం ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌లో త‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూ.... వెంక‌ట‌సిద్ధారెడ్డి గారు క్రూసేడ‌ర్‌. ఎన్నో మంచి సినిమాల‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ సినిమాకు డైరెక్ష‌న్ చేసే అవ‌కాశం నాకు ద‌క్కింది. కానీ నేను వ‌దులుకున్నాను. 
 
మ‌ల్లేశం గారి క‌థ విన్న‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు.. ప్యాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌కు చెప్పాల్సిన చిత్ర‌మ‌ది అనిపించింది. ఇండ‌స్ట్రీలో మ‌నం చేసే వ‌ర్క్‌కి మీడియా అటెన్ష‌న్ రాగానే దేవుళ్లం అయిపోతాం. నిజానికి మ‌ల్లేశం గారి లాంటి వ్య‌క్తులు ఇన్‌స్పిరేష‌న్‌. చాలా మంది ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ రాక అలాగే ఉండిపోతున్నారు. మ‌న ప‌క్కింట్లోనే, ఊర్లోనే జ‌రిగే ఇలాంటి క‌థ‌ను తెర‌కెక్కించ‌డం అనేది ఓ బాధ్య‌త‌. స్టీరియో టైప్ వంటి సినీ వ‌ర్గీక‌ర‌ణ‌లు ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. నేను భ‌య‌ప‌డ‌లేదు. భ‌య‌ప‌డ‌ను.. ఫ్యూచ‌ర్ జ‌న‌రేష‌న్ కూడా భ‌య‌ప‌డ‌దు. 
 
ఎందుకంటే.. మాకు క‌థ‌లు కావాలి. ఎన్నో విభిన్న‌మైన క‌థ‌ల‌ను వినాల‌ని ప్రేక్ష‌కులుగా అనుకుంటున్నాం. మ‌న తాత‌లాంటి సినిమాల‌ను వేరే భాష‌ల్లో చేస్తున్నారు. మ‌నం ఆగే ప‌రిస్థితి రాకూడ‌దు కూడా.ఏ క‌థ‌నైనా మూవీ మేక‌ర్స్‌గా వెతికి ప‌ట్టుకుని బ‌య‌ట‌కు తెస్తాం. ఇది ఆర్ట్ సినిమానా, క‌మ‌ర్షియ‌ల్ సినిమానా? హీరో ఉన్నాడా? క‌మెడియ‌న్ ఉన్నాడా? అని చూడొద్దు. ట్యాగ్ లైన్ ఫేడ్ అవుట్ అయిపోవాలి. 
 
హీరో, క‌మెడియ‌న్ అనే ట్యాగ్‌లైన్ యాక్ట‌ర్ అనే ట్యాగ్‌లైన్ వ‌స్తుందో ఆరోజు చాలా ముందుకు వెళ‌తాం. మ‌న భ‌విష్య‌త్ త‌రాల‌కు ఎన్నో విలువ‌ల‌ను అందిస్తాం. సినిమా అనేది ఒక వ్య‌క్తిని గ్లోరిఫై చేయ‌దు.. సోసైటీని గ్లోరిఫై చేస్తుంది. స్టోరీ ఆఫ్ ఫ్యూచ‌ర్‌. సినిమా అనేది ట్రూ ఫామ్ ఆఫ్ డెమోక్ర‌సీ. ప్రియ‌ద‌ర్శి ఒక్కొక్క పాత్ర‌లో ఎంతో క‌ష్ట‌ప‌డి జీవం పోసుకుంటున్నాడు. `పెళ్లిచూపులు` స‌మ‌యంలో త‌న‌కు బెస్ట్ క‌మెడియ‌న్ అవార్డ్ రాగానే, బ‌య‌ట‌కు వ‌చ్చేశాను. త‌ను క‌మెడియ‌న్ అనే మోడ్ నుండి ఈరోజు బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. `మ‌ల్లేశం` ఓ  గ్రేట్ ఫిలిం. దీన్ని ప్ర‌మోట్ చేయ‌డానికి ఎలాంటి స్టార్స్ అవ‌స‌రం లేదు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జున బంగార్రాజు సినిమా అస‌లు ఉందా..? లేదా..?