Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిప్పీ ట్రైల‌ర్ విడుద‌ల‌కు ముహుర్తం ఫిక్స్.... హిప్పీకి హిట్ వ‌చ్చేనా..?

Advertiesment
హిప్పీ ట్రైల‌ర్ విడుద‌ల‌కు ముహుర్తం ఫిక్స్.... హిప్పీకి హిట్ వ‌చ్చేనా..?
, బుధవారం, 8 మే 2019 (14:32 IST)
ఆర్ఎక్స్ 100 సినిమాతో కార్తికేయ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడో తెలిసిందే. తాజాగా హిప్పీ అనే డిఫ‌రెంట్ టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ చిత్రానికి టి.ఎన్.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌లైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 త‌ర్వాత హీరో కార్తికేయకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో కార్తికేయ‌ తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల నాని రిలీజ్ చేసిన ఈ మూవీ టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 
 
ఈ నెల 9న థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. డిఫ‌రెంట్ కాన్సప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. హిప్పీ అని టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలో ఒక‌టే డౌట్. అస‌లు హిప్పీ అంటే ఏంటి అని. ఇదే విష‌యం గురించి డైరెక్ట‌ర్ టి.ఎన్.కృష్ణని అడిగితే.... హిప్పీ అంటే కేర్ ఫ్రీ. కథ కూడా అలాగే ఉంటుంది. కార్తికేయ బాడీలాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయే చిత్రం ఇది. ఆర్ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ తర్వాత కార్తికేయ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. 
 
అలాంటి పరిస్థితుల్లో ఆయనతో సినిమా చేయడం ఛాలెంజ్‌గా అనిపిస్తున్నది. వెరీ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ ఇది. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు నివాస్ ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 7న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. నిజంగానే ఈ సినిమా ఆక‌ట్టుకుంటుందా..? హిప్పీ కార్తికేయ‌కు హిట్ ఇస్తుందా..? లేదా..? అనేది ఆస‌క్తిగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మహర్షి' నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు