Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 9న వస్తున్న తీరం - టీజర్ విడుదల

అక్టోబర్ 9న వస్తున్న తీరం -  టీజర్ విడుదల
Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (23:23 IST)
Teeram team with srikanth
శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ నాయికా నాయకులుగా యం. శ్రీనివాసులు నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం `తీరం`. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అక్టోబర్ 9న అత్యధిక ధియేటర్సలలో గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం టీజర్ ను శ్రీకాంత్ విడుదల చేశారు. ఆయన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో, దర్శకులు అనిల్ ఇనమడుగు, శ్రావణ్ వైజిటి,  సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, నటులు అజయ్, ఇజాజ్ జాన్, సునీల్ ఉప్పిరెట్ల, జై, కెమెరామెన్ శ్రవణ్ జి కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ బిజె తదితరులు పాల్గొన్నారు. 
 
అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ, తీరం టీజర్ చూశాను. ఆక‌ట్టుకునేలా ఉంది. సీన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.  మ్యూజికల్ లవ్ స్టోరీతో పాటు భావోద్వేగాల సమ్మేళనంతో సినిమా తీశారని తెలుస్తుంది. ఇప్పుడు అందరూ కొత్త కథలతో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. అనిల్ టేకింగ్ చాలా బాగుంది. కెమెరా వర్క్, మ్యూజిక్ సుపెర్బ్ గా చేశారు. నిర్మాత శ్రీనివాసులు చిన్న సినిమా అయినా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీరం చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఇంకా మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలి. అక్టోబర్ 9న వస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని.. అవుతుందని నమ్ముతూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్.. అన్నారు. 
 
అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ, యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా నిర్మాత శ్రీనివాసులు కథని నమ్మి నా మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మించారు.. సినిమా బాగా వచ్చింది.. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.. ముఖ్యంగా అడిగిన వెంటనే మా మూవీ టీజర్ ను శ్రీకాంత్ గారు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ అందరి తరుపున ఆయనకి మా కృతజ్ఞతలు.. అక్టోబర్ 9న మా చిత్రం విడుదలవుతుంది.. అన్నారు. 
 
చిత్ర నిర్మాత యం. శ్రీనివాసులు మాట్లాడుతూ,  కొత్త వారైనా కూడా తీరం చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దారు. సెన్సార్ పనులు అన్నీ పూర్తి అయ్యాయి. మా సినిమా టీజర్ ను శ్రీకాంత్ గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకి మా టీమ్ అందరి తరుపున చాలా థాంక్స్. అక్టోబర్ 9న తీరం చిత్రాన్ని సినేటెరియా సంస్థ ద్వారా వెంకట్ గారు రిలీజ్ చేస్తున్నారు. సినిమాని ఆదరించి పెద్ద విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నానని అన్నారు. 
 
సినేటెరియా గ్రూప్ సంస్థ అధినేత వెంకట్ బోలేమోని మాట్లాడుతూ, తీరం ఒక అద్భుతమైన ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం. సినిమా చూశాను. శ్రీనివాసులు గారి మేకింగ్, అనిల్ టేకింగ్ బ్యూటిఫుల్ అనే చెప్పాలి.. మ్యూజిక్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుంది. మా సినేటెరియా ద్వారా ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న అత్యధిక థియేటర్స్ లలో భారీగా రిలీజ్ చేస్తున్నాం.. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్! (Video)

అమెరికాలో అనుమానాస్పదస్థితిలో తెలుగు విద్యార్థి మృతి!!

kadapa: కుర్చీ కోసం నిల్చున్న కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఎక్కడ?

6G: టెక్నాలజీ పెరిగిపోతున్నా.. డిజిటల్ డార్కులో వున్న తెలంగాణ స్కూల్స్

Jagan: డిసెంబర్ 24 నుంచి కడప జిల్లాల్లో జగన్ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments