Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకంటే రోషన్ బాగుంటాడు - త‌ను దబాంగ్ 3 కి ప‌నిచేశాడుః శ్రీ‌కాంత్‌

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (23:08 IST)
Srikanth- Roshan
`రోషన్‌ను ఇప్పుడే న‌టుడిగా దింపే ఆలోచన లేదు. ఇంకో ఏడాది ఆగుదామని అనుకున్నాం. లాస్ ఏంజిల్స్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ `దబాంగ్ 3` సినిమాకు  ప్రభుదేవా దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. అనుభ‌వం కోసం అవన్నీ చేశాడు. నేను కేవలం సాయం మాత్రమే చేశానన‌ని` శ్రీ‌కాంత్ తెలిపాడు. త‌న కుమారుడు చేస్తున్న పెండ్లిసంద‌డి తాను చేసిన పెండ్లి సందడి సినిమాను గురించి ఆయ‌న మాట్లాడారు.
 
- ఓ సారి రాఘవేంద్ర రావు గారు  ఫోన్ చేసి రోషన్ గురించి అడిగారు. ఇంకా చిన్నపిల్లవాడే  కదా? అని అన్నారు. అది పదేళ్ల క్రితమండి.. ఇప్పుడు కాదు అని అన్నాను.  ఓసారి నా దగ్గరికి తీసుకురావా? అని అడిగారు. అలా మేం ఇద్దరం వెళ్లాం. పెళ్లి సందడి ఫ్లేవర్‌తో అదే టైటిల్ పెట్టి సినిమా తీసేందుకు  స్క్రిప్ట్ వరకు కూడా రెడీ అయింది. రోషన్ కోసం అనే కాదు కానీ కథను రెడీ చేసుకున్నారు. కానీ మధ్యలో ఎవరో చెప్పినట్టున్నారు. శ్రీకాంత్ కొడుకు అయితే బాగుంటుందని అన్నట్టున్నారు. అలా రోషన్‌ను చూసి.. కరెక్ట్‌గా సరిపోయాడు.. ఈ ఏజ్‌ ఉండాలనే అనుకున్నానని రాఘవేంద్రరావు గారు అన్నారు. అలా సినిమా ఆఫర్ వచ్చింది.
 
- రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఎంతో మంది హీరోలు లాంచ్ అయ్యారు. ఆ అవకాశం రావడం రోషన్ అదృష్టం. ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. అలాంటి వారి దర్శకత్వంలో రోషన్ చేయడం ఆనందంగా ఉంది.
 
- ఆ సినిమాకూ దీనికి పోలికలు అయితే అందరూ పెడతారు. అది తెలిసిన విషయమే. ఎవరు బాగా చేశారు? ఎవరు బాగున్నారు? అని తేడాలు చూస్తారు. కానీ నాకంటే  రోషన్ బాగుంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. మనం కష్టపడితేనే గుర్తింపు వస్తుంది. మొదటి సినిమానే కదా? నేను ఎక్కువగా గర్వంగా చెప్పుకోకూడదు. పొగడకూడదు.
 
- ఇప్పుడు వస్తున్న జానర్లకంటే కొత్తగా ఉంటుంది. పెళ్లిలో ఉండే గోల, ఆ సందడి, కామెడీ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఇలా అన్నీ బాగుంటాయి. మహిళా ప్రేక్షకులందరూ కూడా వచ్చి చూసే  చిత్రమవుతుంది. ఎఫ్ 2 సినిమా ఎంత ఫ్రెష్‌లా అనిపించిందో.. పెళ్లి సందD కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. సాంగ్స్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇందులో బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా రోషన్ కనిపించబోతోన్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

కర్నూలులో దారుణం: చిన్నారి శరీరానికి రంగు పూసి భిక్షాటనకు రోడ్డుపై కూర్చోబెట్టారు

పవన్ కల్యాణ్ గారికి దణ్ణం, తుమ్మలచెరువు గ్రామంలో శరవేగంగా సీసీ రోడ్డు పనులు video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments