Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

దేవీ
సోమవారం, 7 ఏప్రియల్ 2025 (07:04 IST)
Tamannaah Bhatia
తమన్నా భాటియా 'ఓదెల 2' మూవీలో ఇంతవరకు వేయని పాత్రతో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటీవలి రీలీజిన టీజర్ ఎక్సయిట్మెంట్  పెంచింది, అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఇప్పుడు మేకర్స్ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ అప్‌డేట్‌తో వచ్చారు.
 
ఓదెల 2 థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 8న ముంబైలో జరిగే గొప్ప ఈవెంట్ లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. కోర్ టీమ్ హాజరు కానున్న ఈ కార్యక్రమంలో టీమ్ తెలుగు, హిందీ ట్రైలర్‌లను లాంచ్ చేయనుంది.
 
ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరిగింది. టీజర్‌ను కుంభమేళాలో లాంచ్ చేశారు. ఇప్పుడు, ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ ముంబైని ఎన్నుకున్నారు. విడుదల దగ్గర పడుతుండటంతో ఓదెల 2  ప్రచార కార్యక్రమాలు దూకుడుగా జరుగుతున్నాయి.  
 
ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానున్న ఓదెల 2 ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా నిలుస్తుంది. తమన్నా భాటియా నాగ సాధువుగా అద్భుతంగా నటించి పవర్ ఫుల్ పాత్రకు ప్రాణం పోశారు.  
 
హెబ్బా పటేల్, వసిష్ట ఎన్ సింహా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎక్సయిటింగ్ యాక్షన్‌ను అద్భుతమైన కథలతో కలపగల సామర్థ్యం వున్న సంపత్ నంది ఓదెల 2 చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి కాంతర ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజీవ్ నాయర్  ఆర్ట్ డైరెక్టర్, సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టాలెంటెడ్ టీమ్‌తో ఓదెల2  సినిమా మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
 
తారాగణం: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments