నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

ఠాగూర్
ఆదివారం, 6 ఏప్రియల్ 2025 (19:49 IST)
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు. గత ఫిబ్రవరి 13వ తేదీన నుంచి తన ఎక్స్‌ ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. అయితే, తాజాగా ఇపుడు తన ఎక్స్‌ ఖాతా రికవరీ అయిందని ఆమె ఓ వీడియో ద్వారా తెలిపింది. 'ఇన్ని రోజులూ నా ఖాతా హ్యాక్ అయ్యింది. నా ఖాతాలో ఇప్పటివరకు బెట్టింగ్ యాడ్స్, స్పామ్ యాడ్స్‌లు ప్రచారంలో ఉన్నాయని, వాటిని రిపోర్టు చేయాలని ఆమె కోరారు. 
 
యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ! 
 
చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన తమన్నా భాటియా... 20 యేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. గత 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే చిత్రంతో ఆమె నటిగా అడుగుపెట్టి వివిధ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రను పోషించిన "ఓదెల-2" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన 20 యేళ్ళ సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
నిజ జీవితంలో తాను కాలేజీ విద్యను అభ్యసించకపోయినప్పటికీ సినిమాల్లో మాత్రం విద్యార్థినిగా నటించానని తెలిపారు. పరిశ్రమలో 20 యేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేరీర్ ప్రారంభించినపుడు ఇన్నేళ్లు కొనసాగుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. అలాగే, తన 21వ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. 
 
ఆ రోజు షుటింగ్ నుంచి విరామం తీసుకుని ఇంటిలో ఉండగా, ఒక తమిళ పత్రికలో తనను నెంబర్ 1 హీరోయిన్‌గా పేర్కొంటూ ఒక ప్రత్యేక కథనం వచ్చిందన్నారు. అది చదివి తాను కన్నీళ్లు పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ స్థాయికి త్వరగా చేరుకుంటానని తాను ఎపుడూ అనుకోలేదన్నారు. నంబర్ 1 స్థానానికి చేరుకున్న తర్వాత ఆ స్థానంలో కొనసాగడం అంత సులువుకాదని ఆమె చెప్పుకొచ్చారు. అది ఒక బాధ్యతగా భావించి ప్రేక్షకులను ఆలరించే విధంగా సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఈ స్థాయికి చేరుకున్నానని తమన్నా వివరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha Son Political Debut: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రోడ్డుపైకి వచ్చిన కవిత కుమారుడు (video)

కింగ్ కోబ్రా కాటుకు గిలగిల కొట్టుకుని చనిపోయిన మృగరాజు (video)

హిందీలో అనర్గళంగా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు.. కొనియాడిన పీఎం

పబ్‌జీ గొడవా లేకుంటే ప్రేమ వ్యవహారమా..? స్నేహితుడి కాల్చి చంపేశాడు..

Revanth Reddy: రేవంత్ రెడ్డి మంత్రి వర్గం ఓ దండుపాళ్యం గ్యాంగ్.. హరీష్ రావు ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments