Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

Advertiesment
jackqueline fernandez

ఠాగూర్

, ఆదివారం, 6 ఏప్రియల్ 2025 (14:51 IST)
ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ఇంట విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మార్చి నెల 24వ తేదీన గుండెపోటు గురైన ఆమెను కుటుంబ సభ్యులు హాటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అప్పటి నుంచి ఆమె అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, కిమ్ మృతిపట్ల సినీ ప్రియులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు. 
 
ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు 
 
దివంగత ఎన్.టి.రామారావు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ఆయనతో తాను తీసిన "అడవిరాముడు" చిత్రం తన కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసిందని దర్శకేందుడు కె.రాఘవేంద్ర రావు అన్నారు. ఆ సినిమా అప్పట్లో వంద రోజులు ఆడిందన్నారు. ఆ మూవీ షీల్డ్‌ను ఇప్పటికీ తన ఇంట్లో గుర్తుగా పెట్టుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో తాను అనేక చిత్రాలు తీశానని చెప్పారు. 
 
అయితే, ఆయన నటన తనకు ఎపుడూ ఆశ్చర్యం కలిగించేదన్నారు. ఆయనలాంటి నటుడిని తాను ఎపుడూ చూడలేదన్నారు. తన శిష్యుడుగా వచ్చిన రాజమౌళి ఇపుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. చిత్రపరిశ్రమకు రాజమౌళిని ఇచ్చాననే ఒక సంతృప్తి తనకు ఉందని, తనకు అది చాలని రాఘవేంద్ర రావు అన్నారు. 
 
కాగా, చిత్రపరిశ్రంలో దర్శకేంద్రుడుగా గుర్తింపు పొందిన కె.రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన అనేక వైవిధ్యభరితమైన సినిమాలను రూపొందించారు. ఎంతోమంది స్టార్ హీరోలుగా చేయడంతో పాటు ఇంతో మందికి నటన నేర్పించి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు. తాజాగా ఆయన పర్యవేక్షణలో కథాసుధ అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఇది ప్రముఖ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రసార కార్యక్రమాల్లో భాగంగా ఆయన పైవిధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...