ముంబై ఇండియన్స్ అభిమానులకు శుభవార్త. ఆ జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని జట్టులో చేరాడు. ఈ మేరకు ఆ జట్టు మేనేజ్మెంట్ అధికారికంగా వెల్లడించింది. ఈ వార్త ముంబై ఇండియన్స్‌కు నిజంగానే శుభవార్త వంటింది. ఐపీఎల్ సీజన్‌లో సరైన స్ట్రైక్ బౌలర్ లేక ఆ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లు ఆడితే అందులో మూడింటిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో బుమ్రా తిరిగివచ్చాడన్న వార్త అభిమానులను ఆనందోత్సవాల్లో ముంచెత్తుతోంది.
ఐదు సార్లు చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఓ వీడియోను విడుదల చేస్తూ.. గర్జించడానికి సిద్ధంగా ఉంది అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. బుమ్రా తిరిగి రావడం ముంబై ఇండియన్స్ ఎంతో ఊరటనిచ్చే అంశం. బెంగుళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుమ్రా పునరాగమనానికి మార్గం సుగమమైంది. బుమ్రా రాకతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం మరింత బలోపేతం కానుంది.
బుమ్రా రాకతో జట్టుకు కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు. బుమ్రా తన ఖచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేయగలడని, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటుూ జట్టుకు విజయాలు అందించగల సత్తా బుమ్రాకు ఉందనే మంచి పేరుంది. ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో రేపు వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఎలాంటి ప్రభావం చూపిస్తాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.