Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్షన్, థ్రిల్లింగ్, మాస్ ఎలిమెంట్స్‌ను కలబోతగా సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ ట్రైలర్

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (20:31 IST)
Pridhvi,prabhas
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంచనాలు పెంచుకుంటూ వస్తోన్న ఈ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్ టీజర్ రిలీజ్ తర్వాత ఆకాశాన్నంటాయి.

ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకుల్లో ఎగ్జయిట్‌మెంట్ మరింత పెరిగింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలా ఉండబోతుందోనని అందరూ ఆతృతగా ఎదురు చూడసాగారు. ఎట్టకేలకు అందరి ఎదురు చూపులు ఫలించాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్‌డ్, థ్రిల్లింగ్, మాస్ అంశాల కలయికగా ఉన్న ఈ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.  
 
ప్రభాస్‌ను ఆయన అభిమానులు, సినీ లవర్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి థ్రిల్లింగ్, యాక్షన్  ఎలిమెంట్స్ అన్ని ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’ లో ఉన్నాయి. యాక్షన్ ప్యాక్డ్‌గా మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్‌లో చెప్పారు. ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’ ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఈ ఏడాది మాస్ మూవీగా ఇది ప్రేక్షకులను మెప్పించనుంది. 
 
పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్, బిగ్గెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిస్తే సినిమా ఎలా ఉంటుందో అనే దానికి ట్రైలర్ ఓ ఉదాహరణగా కనిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌తో రూపొందుతోన్న తొలి సినిమా ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’.
 
ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీ హాసన్, జగపతి బాబు, బాబీ సింహ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  హై బడ్జెట్, టెక్నికల్ వేల్యూస్ ఉన్న ‘సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్’ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 22న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments