ప్రభాస్ సాలార్ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1 న విడుదల చేస్తున్నట్లు నిన్ననే ప్రకటించారు చిత్ర నిర్మాతలు. నేడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ పంపిణీదారులతో మా సహకారాన్ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము అని నిర్మాతలు సోషల్ మీడియాలో ప్రకటించారు. క్రిష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ జిల్లాల నుంచి పంపిణీదారుల లిస్ట్ ను తెలియజేసింది.
సాలార్ ట్రైలర్ డిసెంబర్ 1వ తేదీన రాత్రి 7:19 గంటలకు విడుదల కాబోతుంది. సినిమా డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నారు. కాగా, సాలార్ సినిమా పోస్టర్ ను హీాలీవుడ్ మూవీ తరహాలో డైనోసార్ బ్యాక్ డ్రాప్ పెట్టి ప్రభాస్ గురి పెడుతున్నట్లు అభిమానులు తన అభిమానాన్ని చాటుకున్నారు. జురాసిక్ పార్క్ స్థాయిలో ఈ సినిమా వుండబోతుందని హింట్ ఇచ్చారు. మరి ఈ సినిమా నేపథ్యం ఏమిటో ఇంతవరకు దర్శక నిర్మాతలు తెలియజేయలేదు. ట్రైలర్ చూశాకే విషయం అర్థమవుతుందని నిర్మాతలు చెబుతున్నారు.