Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హాయ్ నాన్న నుంచి పార్టీ అంథమ్ ఒడియమ్మ పాట విడుదల

Odiyamma song
, బుధవారం, 29 నవంబరు 2023 (13:49 IST)
Odiyamma song
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'.  వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే పెద్ద మ్యూజికల్ హిట్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా, ఈరోజు నాలుగో పాట ఒడియమ్మను వర్ధమాన్ కాలేజ్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ తో కలసి హీరో నాని వేదికపై ఒడియమ్మ పాటకు డ్యాన్స్ చేయడం కన్నులపండగలా అనిపించింది.
 
సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ పెప్పీ, లైవ్లీ , గ్రూవీ పార్టీ నెంబర్ గా ఈ పాటని కంపోజ్ చేశారు. ఎలక్ట్రానిక్ బీట్‌లు, ఎనర్జిటిక్ వొకల్స్ పాటని ఇన్స్టంట్ హిట్ మార్చాయి.  ధృవ్ విక్రమ్, శృతి హాసన్, చిన్మయి శ్రీపాద అద్భుతంగా పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. దేవదాసు నుండి ఏఎన్ఆర్ మాటలు పాటలో చేర్చడం అదనపు ఆకర్షణగా నిలిచింది.
 
నాని, శ్రుతి హాసన్ ఇద్దరూ తమ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేశారు. కలర్‌ఫుల్ సెట్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. విజువల్స్ బ్రైట్‌గా ఉన్నాయి. డిసెంబరు 31న ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ ని జరుపుకునే అద్భుతమైన మూమెంట్స్ ని ఈ పాట బ్యూటీఫుల్ గా సెలబ్రేట్ చేస్తోంది.
 
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఇలాంటి ఎనర్జిటిక్ సాంగ్ ని ఇంత ఎనర్జిటిక్ ఆడియన్స్ ముందు లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే ఫస్ట్ డే మార్నింగ్ షో హౌస్ ఫుల్ థియేటర్ ని చూస్తున్నట్లు వుంది. ఈ రోజు ఇక్కడ రావడం మీ అందరికీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. పనిలో పనిగా హాలీడే కూడా దొరికేసింది(నవ్వుతూ). ఈ సినిమాకి మీ చైర్మన్ గారు నిర్మాత అనే కంటే మీరంతా నిర్మాతలే. ఇది మీ ప్రోడక్ట్. మీరు వోన్ చేసుకుకోవచ్చు. రిలీజ్ రోజున టికెట్స్ దొరక్కపొతే ఇది మా సినిమా మాకు టికెట్స్ ఇవ్వకపోవడం ఏమిటనే అడగండి(నవ్వుతూ). ఈ పాట మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. ఇకపై మీరు ఎక్కడికి వెళ్ళిన, పార్టీ ఎక్కడ జరిగినా ఈ పాటే మోగాలి. డిసెంబర్ 7న హాయ్ నాన్న విడుదలౌతుంది. ఇది మన సినిమా. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంటెంట్ వుంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు : ఉపేంద్ర గాడి అడ్డా హీరో కంచర్ల ఉపేంద్ర