దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ తెలుగు, తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు ఓ అందాల రాక్షసి అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షెరాజ్ మెహదీ సమర్పణలో ఓ అందాల రాక్షసి చిత్రం రాబోతోంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. మార్చ్ 21న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ క్రమంలో టైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హార్రర్ జానర్లను కలిపి తీసినట్టుగా అనిపిస్తోంది. విజువల్స్, కెమెరా వర్క్ చాలా రిచ్ గా కనిపిస్తుంది.
షెరాజ్ మెహది యాక్టింగ్, మేకింగ్, టేకింగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. హారర్ మూమెంట్స్ చాలా థ్రిల్లింగ్ గా కనిపిస్తున్నాయి. టైలర్ లో చివరి షాట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. భాష్య శ్రీ ఈ సినిమాకు అందించిన కథ, మాటలు హైలెట్ అయ్యేలా ఉన్నాయి. త్వరలోనే రాబోతున్న ఈ చిత్రంపై ట్రైలర్ ఒకసారిగా అంచనాలు పెంచేసింది.