Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vikram: ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ పర్శన్ గా విక్రమ్ నటించిన వీర ధీర సూర టీజర్

Advertiesment
Veera Dheere Soora

దేవీ

, శనివారం, 15 మార్చి 2025 (20:23 IST)
Veera Dheere Soora
చియాన్ విక్రమ్, దుషార విజయన్ జంటగా నటించిన సినిమా వీర ధీర సూర. సేతుపతి, చిత్తా సినిమాల దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకుడు. హెచ్.ఆర్. పిక్చర్స్, రియా శిబు నిర్మించిన ఈ సినిమా రెండు భాగాల యాక్షన్, ఫ్యామిలీ డ్రామా. ఇంట్రస్టింగ్ గా ఈ చిత్రం యొక్క రెండవ భాగం మొదట మార్చి 27న విడుదల కానుంది. ఎన్.వి.ఆర్ సినిమా తెలుగు రైట్స్ ని సొంతం చేసుకోగా, నైజాం రిలీజ్  మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జరుగుతుంది.
 
విక్రమ్ తన భార్య (దుషార విజయన్) కుమార్తెతో హార్ట్ ఫుల్ మూమెంట్స్ పంచుకునే ఫ్యామిలీగా ప్రజెంట్ చేస్తూ టీజర్ బిగెన్ అవుతుంది. ఒక క్రైమ్ లోకల్ ఫెస్టివల్ కు అంతరాయం కలిగించినప్పుడు ప్రశాంతత చెదిరిపోతుంది. విక్రమ్ ను  ప్రతీకారం తీర్చుకునేలా చేస్తుంది. ఈ టీజర్ విక్రమ్ గతాన్ని కూడా పరిచయం చేస్తుంది. ఇందులో SJ సూర్యను మానిప్యులేటివ్ పోలీస్ పాత్రలో, సూరజ్ వెంజరమూడును టెర్రిఫిక్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రజెంట్ చేశారు
 
విక్రమ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ గా, రివెంజ్ తీర్చుకునే ఇంటెన్స్ పర్శన్ గా రెండు కోణాల్లో ఆదరగొట్టారు. SJ సూర్య, సూరజ్ వెంజరమూడు పెర్ఫార్మెన్స్ కట్టుకున్నాయి.  
 
S.U. అరుణ్ కుమార్ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు, థ్రిల్లింగ్ యాక్షన్, ఇంటెన్స్ డ్రామా బ్లెండ్ చేశారు. తేని ఈశ్వర్ ISC సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తుంది, ప్రతి ఫ్రేమ్ ఎక్సయిటింగ్ గా వుంది. G.V. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ విజువల్స్‌ ని మరింత ఎలివేట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Samantha : సమంత నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో శుభం చిత్రం