Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vijayashanthi: అప్పట్లో ఐస్ క్రీమ్ తిన్నా, అందుకే అమ్మకు కేక్ తినిపిస్తున్నా: కళ్యాణ్ రామ్

Advertiesment
Kalyan Ram, Vijayashanthi

దేవీ

, సోమవారం, 17 మార్చి 2025 (12:18 IST)
Kalyan Ram, Vijayashanthi
నందమూరి కళ్యాణ్ రామ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. నేడు ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో లాంఛ్ చేశారు. 
 
webdunia
Kalyan Ram, Vijayashanthi
అనంతరం కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, కర్తవ్యం సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. అప్పట్లో అమ్మ (విజయశాంతి) చేసిన స్టంట్స్, ఎమోషన్ వర్ణించలేం. ప్రదీప్ నాకు కథ చెప్పినప్పుడు కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్ కనిపించింది. ఆమె ఒప్పుకుంటుందో లేదో అని అనుమానం కలిగింది. అమ్మ ఒప్పుకోకోతే కరెక్ట్ కాదేమోనని అనిపించింది. అమ్మ ఈ వయసులోకూడా ఫైట్స్ బాగా చేశారు. ప్రుధ్వీ రాజ్ కూడా మంచి పాత్ర చేశారు. యానిమల్ లో మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా అంతకంటే పేరు వస్తుందని అన్నారు. అతనొక్కడే సినిమా  20 ఏళ్ళు అయింది. ఇంకా గుర్తింది. అలాగే ఈ సినిమా కూడా అలానే వుంటుంది.
 
కథ గురించి చెప్పాలంటే.. మనకు ప్రాణం పోయడం కోసం వారి ప్రేమపోయేవరకు అమ్మలు మనల్ని కాపాడతారు. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. ఇదే పాయింట్ తో సినిమా తీశాం. 
 
చిన్నప్పుడు, బాబయ్ చేసిన షూటింగ్ కు వెళ్ళాను. సూర్య ఐ.పి.ఎస్. చిత్రం షూటింగ్ కు వెళ్ళాను. విజయశాంతిగారు అప్పట్లో స్వంత బిడ్డలా నన్ను చూసుకునేది. ఐస్ క్రీమ్ ఇప్పించారు. మా బాబాయ్ కాంబినేషన్ ఆమె నటించారు. తెలీయకుండా చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు ప్రేమ కనిపించింది. తల్లి, బిడ్డ మధ్య ప్రేమ కనిపించింది. అందుకే అమ్మకు ఈరోజు కేక్ తినిపించాలని అనుకున్నానంటూ కేక్ తెచ్చి అమ్మకు హ్యాపీ బర్త్ డే చెప్పి కేక్ తినిపించారు.
 
విజయశాంతి మాట్లాడుతూ, ఈ కథ చెప్పగానే ఏదో తెలీని ఫీలింగ్ కలిగింది. కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు. అమ్మ, కొడుకు కథ అని దర్శకుడు చెప్పారు. నాకు బాగా నచ్చింది. అయితే ఇంకా బెటర్ చేయాలని సూచించాను. ఏడాదిపాటు టైం తీసుకుని కథను ఒక కొలిక్కి తెచ్చారు. కళ్యాణ్ రామ్ ను రామ్ అని పిలుస్తా. మంచి మనసున్న వాడు. అందరం కలిసి ఫ్యామిలీస్ గెట్ టు గెదర్ లా కలుసుకోవాలని అనుకుంటున్నాను. సినిమా విడుదలయ్యేవరకు నాన్ వేజ్ తిననని దేవుడికి మొక్కుకున్నాను. అలాగే చేస్తున్నాను అన్నారు.
 
ఇంకా ఆమె  మాట్లాడుతూ, చాలామంది యాక్షన్ సినిమా చేయమని అడిగేవారు. నిజంగా కుదురుతుందా లేదా అని అనుకున్నా. ఈ సినిమాలో కుదిరింది. యాక్షన్ సీన్ చేస్తుండగా అందరూ టెన్షన్ పడ్డారు. వయస్సులో వుండగానే ఈజీగా చేసుకుంటూ పోయాను. ఫస్ట్ షాట్ కే యాక్షన్ మొదటి సారే టేక్ అయింది. అందరూ సంతోషించారు. ఎప్పుడూ విజయశాంతి అదే రోషం, పౌరుషం. నేను ఎప్పుడూ స్ట్రాంగ్ గానే వుంటాను అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Namrata: మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన నమ్రతా శిరోద్కర్