Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Advertiesment
Kalyan Ram and Vijayashanti

దేవి

, శనివారం, 8 మార్చి 2025 (18:06 IST)
Kalyan Ram and Vijayashanti
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21లో విజయశాంతి IPS ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తునారు. 
 
మహిళా దినోత్సవం సందర్భంగా, మూవీ టైటిల్ 'అర్జున్ S/O వైజయంతి' గా రివిల్ చేస్తూ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలని ఇంటెన్స్ డైనమిక్ గా ప్రజెంట్ చేస్తోంది. మండుతున్న జ్వాలల మధ్య దృఢ సంకల్పంతో నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఫ్యాక్టరీ లాంటి వాతావరణం, చెల్లాచెదురుగా ఉన్న ఇనుప గొలుసులు ఇంటన్సిటీని పెంచుతున్నాయి.
 
మ్యాసీవ్ హ్యాండ్ కప్స్ పాత్రలను కలుపుతున్నాయి, వారి బాండింగ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. కళ్యాణ్ రామ్ రా పవర్, కళ్ళులో ఇంటన్సిటీతో అదరగొట్టారు. విజయశాంతి ఖాకీ దుస్తులలో ఆజ్ఞాపిస్తూ కనిపించారు, పోస్టర్ ఫెరోషియస్ వైబ్‌ను మరింత పెంచుతుంది. టైటిల్‌ను "S", "O" అక్షరాలు గొలుసుతో అనుసంధానించబడి చూపించడం సినిమా థీమ్‌కు సింబాలిక్ గా ప్రజెంట్ చేస్తోంది. టైటిల్, ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్నాయి.
 
అర్జున్ S/O వైజయంతిలో సాయి మంజ్రేకర్ హీరోయిన్. సోహైల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు విజువల్స్‌ను సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అందించగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. తమ్మిరాజు ఎడిటర్. స్క్రీన్‌ప్లేను శ్రీకాంత్ విస్సా రాశారు.
 
సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. మిగిలిన పార్ట్‌లు పూర్తయ్యాక, రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.
 
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు