Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజాకార్ సినిమాలో ఏమి చూపుతున్నారో తెలుసా!

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (14:52 IST)
rajaakaar
1947 అగస్ట్ 15న తెలంగాణాలో ఏమి జరిగింది? అనే పాయింట్ తో రజాకార్ సినిమా రూపొందింది. ఇందులో ఇస్లాం వ్యాప్తి కోసం నవాబ్ ఎంతటి హింసకు పూనుకున్నాడో తెలిపారు. హిందువులును  బెదిరించి, ఎదురుతిరిగితే చంపి, ఆడవాళ్లును  చెరచి  పోలీస్ అధికారులు ఎంతటి పైచాచిక ఆనందం పొందారో ఇందులో చూపారు.  టీజర్ చూస్తేనే ఎంతో కోపం వస్తుంది. ఎవరిపై అప్పటి పాలకులపై, మరి ఇప్పటి పాలకులు కూడా అలాగే ఉన్నారా! అంటే చూసి  తెలుసుకోవాలని చిత్ర యూనిట్ చెపుతోంది. 
 
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సినిమాను అన్ కాంప్రైమ‌జ్డ్‌గా నిర్మించారు నిర్మాత గూడూరు స‌త్య‌నారాయ‌ణ‌. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర నిర్మాత గూడూరు నారాయ‌ణ రెడ్డి, ద‌ర్శ‌కుడు యాటా స‌త్య‌నారాయ‌ణ‌, ఎమ్మెల్యే రాజా సింగ్‌, హీరోయిన్ అనుష్య త్రిపాఠి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...
 
రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘‘నేటి యువతకు సందేశం ఇవ్వడానికే ఈ సినిమా తీశారు. మనకు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది? అనేది చెప్పేందుకు ఈ మూవీని తీశాం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ ఫైల్స్‌, కేరళ ఫైల్స్‌ను ఆపేందుకు చాలా మంది ప్రయత్నించారు. కాశ్మీర్, కేరళల్లో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కానీ సినిమా చూసి తెలుసుకున్నారు. రజాకార్ సినిమా ద్వారా నాడు ఏం జరిగిందో చూపిస్తున్నారు. ఇలాంటి సినిమాను తీసే ధైర్యం చేసిన మా డైరెక్టర్‌కు థాంక్స్. ఈ సినిమాకు నేను గెస్టుగా వచ్చాను కాబట్టి ఇంకా సమస్యలు వస్తాయి. ఈ మూవీని చాలా మంది అడ్డుకుంటారు. దీనికి కౌంటర్‌గా సినిమాలు కూడా ప్రకటిస్తారు. టీజర్ చూస్తేనే ఎంతో కోపం వస్తుంది కదా? రేపు సినిమాను చూస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. కర్ణాటక, మహారాష్ట్ర, మన రాష్ట్రాల్లోని యువతకు మంచి సందేశం ఇచ్చేలా సినిమా ఉంటుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments