Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రం రక్తంతో పారినవేళ - దేవర గిప్ల్స్ చెప్పిందిదే

డీవీ
సోమవారం, 8 జనవరి 2024 (17:53 IST)
Devara Gipples
ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ నాయికగా  సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సినిమా ‘దేవర’.  కొరటాల శివ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ బేనర్ లో రూపొందుతోంది. ఇప్పటివరకు ఒక్కో అప్ డేట్ వచ్చింది. నేడు దేవర గిప్ల్స్ ను పలు భాషల్లో విడుదల చేశారు. 
 
దేవర గిప్ల్స్ లో.. సముద్రంలో ఓ పెద్ద ఓడ వెళుతుంటుంది. ఓ చక్కటి సంగీతం వినిపిస్తుంది. రాత్రి పూట జరిగే ప్రయాణంలో ఆ షిప్ లో పెద్ద పెద్ద కంటైనర్లు వుంటాయి. కొందరు సముద్ర దొంగలు చిన్న పడవలతో వచ్చి పెద్ద ఓడ రాగానే తాళ్ళతో పైకి ఎక్కి అందులోని కంటైనర్లను నీటిలోకి తోసేస్తుంటారు. ఆ తర్వాత కత్తులతో పోరాటం జరుగుతుంది. దేవర ఒక్కొక్కరిని కత్తితో పొడిచేస్తుంటాడు. చివరగా సముద్ర తీరాన దిగగానే ఎర్రటి నెత్తుటితో నీళ్ళు పారుతుంటాయి. దిగిన వెంటనే కాలిని, కత్తిని కడుగి, ఓ చోట కూర్చుని.. ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తురుని ఎక్కువగా చూసుంటాది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. అని దేవర డైలాగ్ తో గిప్స్ ముగుస్తుంది.
 
‘టైగర్ నటన అద్భుతం’ అంటూ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ అంతర్జాతీయ స్థాయి సంగీతాన్ని అందించారు. దేవర గ్లింప్స్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళుతుంది. తన బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మేజర్ ఎసెట్ అవుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్స్ అంచనాలను మించేలా ఎక్కడా తగ్గకుండా అన్‌కాంప్రమైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తున్నాయి. వి.ఎఫ్.ఎక్స్ టీమ్ వర్క్ ప్రతీ ఫ్రేమ్‌ను మరో స్థాయిలో ఆవిష్కరిస్తోంది. టాప్ టెక్నికల్ వర్క్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా ఉండనుందనే విషయాన్ని గ్లింప్స్ ద్వారా తెలియజేశారు.  
 
ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘దేవర’ చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు-రేవంతన్నల భేటీ.. ఆ స్కీమ్‌పై చర్చ.. కారు వరకు వచ్చి సాగనంపారు.. (video)

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. సీపీఐ నారాయణ డిమాండ్

ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య- పా.రంజిత్ భావోద్వేగం.. షాక్ నుంచి తేరుకోని చెన్నై (video)

ప్రపంచ క్షమాపణ దినోత్సవం 2024.. క్షమించమని అడిగితే తప్పేలేదు!!

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.. డార్క్ చాక్లెట్ తింటే మేలే.. కానీ ఎక్కువగా తీసుకుంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments