సాధారణంగా, క్లోమగ్రంధిలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను సక్రమంగా స్రవించకపోవడం, లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మధుమేహం తలెత్తుతుంది. కనుక చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఈ వ్యాధిని అదుపులో వుంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాము.
మధుమేహం వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ పరగడుపున వేపాకురసం కాస్త తీసుకుంటే తగ్గుతుంది. నేరేడు చెక్కను కాల్చి ఆ పొడి భద్రపరచుకుని రోజూ పరగడుపున ఓ చెంచా ఒక గ్లాసు నీళ్లతో కలిపి తాగితే మధుమేహం తగ్గుతుంది.
క్రమం తప్పని వ్యాయామం వల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది. రోజుకు ఒక అరగంట పాటు వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు విధిగా చేయాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి. దీనివల్ల గ్లూకోజ్ క్రమబద్ధీకరించబడుతుంది. క్రమం తప్పకుండా వైద్య చికిత్సలు తీసుకోవడంతో పాటు కొలెస్ట్రాల్ నియంత్రణకు తోడ్పడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం వంటివి పూర్తిగా మానేయాలి.