Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా... రికార్డు స్థాయిలో ఐదోసారి..

Advertiesment
sheik hasina

ఠాగూర్

, సోమవారం, 8 జనవరి 2024 (10:09 IST)
బంగ్లాదేశ్ దేశ ప్రధానమంత్రిగా షేక్ హసీనా మరోమారు ఎన్నికయ్యారు. ఆమె రికార్డు స్థాయిలో ఐదోసారి, వరుసగా నాలుగోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆదివారం బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎస్పీ) ఎన్నికలను బహిష్కరించడంతో అవామీ లీగ్ పార్టీ గెలుపు సునాయాసంగా గెలిచింది. ఇక దేశవ్యాప్తంగా ఆదివారం ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం కౌంటింగ్ మొదలైంది. అన్ని స్థానాల్లో కౌంటింగ్ పూర్తి కాకపోయినప్పటికీ అవామీ లీగ్ పార్టీ గెలుపు లాంఛనమైంది. ఆ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీని కనబరిచారు. 
 
కాగా 'గోపాల్గంజ్-3' నియోజకవర్గం నుంచి ప్రధాని షేక్ హసినా ఎనిమిదోసారి విజయం సాధించారు. 1986 నుంచి ఆమె ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో హసీనాకు 2,49,965 ఓట్లు పడగా తన సమీప అభ్యర్థి, బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాం ఉద్దీన్ లష్కర్కి కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదనపు బాధ్యతలు.... సమన్వయకర్తలుగా మంత్రులు..