బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

దేవి
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (17:36 IST)
Viswk sen
నాకు అమ్మ, అక్క ఉన్నారు. షాప్ కు వెళితే నేను వెంటనే కావాల్సింది కోనేస్తాను. కాని అమ్మ, అక్క కొనరు.. మూడు షాప్స్ తిరిగి మల్లి మొదటికే వస్తారు. నేను లేడీ గెటప్ కోసం వేసిన తర్వాత వారి బాధలు అర్ధం అయింది అని విశ్వక్ సేన్ అన్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడారు.
 
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. విశ్వక్, సోను మోడల్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. సోను వల్ల ఏదో సమస్య అవ్వడంతో పోలీసులు ఇతన్ని వెతకడం మొదలుపెడతారు. దీంతో పోలీసులకు దొరక్కూడదు అని లేడీ గెటప్ వేసుకొని తిరుగుతాడు. మరి లేడీ గెటప్ వేసుకున్నాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు, లైలా ను కొందరు ప్రేమిస్తారు. అదెలా అనేది సినిమా చూడాల్సిందే.
 
ఇందులో లిప్ కిస్ లు ఉన్నాయి. అయితే ఈ సినిమాను పిల్లలు చూదాలనుకుంటే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చాక ఆగాల్సిందే అని విశ్వక్ సేన్ అన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా, బాలకృష్ణ గారు నా సిమిలాలకు సపోర్ట్ చేస్తారు. ఇంకా నా సినిమాలకు చాల మంది సీనియర్ అర్తిస్ లు  వస్తారు. మన ఇండస్ట్రీ అందరికే సపోర్ట్ చేస్తుంది. దాన్ని లేనిపోని గోల్లాలు వేయకండి. అని అన్నారు. ఇందులో కామాక్షి పాత్రలో  సుస్పెన్సు ఉంటుంది. అందుకే పాత్ర రిలీవ్ చేయలేదు అని దర్శకుడు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments