Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

Advertiesment
Sonu model getup

డీవీ

, శుక్రవారం, 17 జనవరి 2025 (19:10 IST)
Sonu model getup
మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. సోను మోడల్, లైలాగా విశ్వక్సేన్ రెండు డిఫరెంట్ లుక్స్ బజ్ క్రియేట్ చేశాయి. మొదటి సింగిల్ కూడా అద్భుతమైన స్పందనను వచ్చింది. ఈ రోజు మేకర్స్ లైలా ఇచిపాడ్ టీజర్‌ను విడుదల చేశారు.
 
ఈ టీజర్ విశ్వక్సేన్ పాత్ర డ్యుయాలిటీని ఎక్సయిటింగ్ గా ప్రజెంట్ చేస్తోంది. ఇందులో అతను సోను మోడల్, లైలా కనిపించారు, ఇద్దరు డిఫరెంట్ పెర్శనాలిటీస్ గా ప్రేక్షకులను నవ్వించి ఆశ్చర్యపరుస్తారు.
 
సోను మోడల్ క్యారెక్టర్ కు సిటీలో ఒక బ్యూటీ పార్లర్ వుంది, ఆ ప్రాంతంలోని మహిళలతో అతను మాట్లాడటం అక్కడ మగవాళ్ళకి నచ్చదు. సోను చరిస్మా అతన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందనే సమయంలో విధి ఊహించని మలుపు తీసుకుంటుంది, ఇది అతను లైలాగా మారడానికి దారితీస్తుంది.
 
విశ్వక్‌సేన్ రెండు పాత్రల అద్భుతంగా పోషించారు. సోను క్యారెక్టర్ లో ఎనర్జీ అదిరింది. లైలాగా కట్టిపడేశారు. దర్శకుడు రామ్ నారాయణ్ ఫ్రెష్ స్టొరీ టెల్లింగ్ ప్రత్యేకంగా నిలిచింది.
 
రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం స్టైలిష్ షాట్‌లతో టీజర్ విజువల్ ఎట్రాక్షన్ ని పెంచుతుంది. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం ఎనర్జీని పెంచుతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మాణ విలువలు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తున్నాయి. స్క్రీన్‌ప్లేను వాసుదేవ మూర్తి రూపొందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ పనిచేస్తున్నారు.
 
టీజర్ ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేయడంతో పాటు, క్యురియాయాసిటీ పెంచింది. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రొమాన్స్, యాక్షన్, కామెడీ పర్ఫెక్ట్ బ్లెండ్ గా వుంటుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతికి ఊహించని అద్భుతం, 200 కోట్ల క్లబ్ కు చేరబోతున్నాం : దిల్ రాజు, వెంకటేష్