Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశ్వక్సేన్ ను కూకట్ పల్లి ఆంటీతో పోల్చడం ప్లాన్ లో భాగమేనా?

Advertiesment
Vishwaxen-lady getup

డీవీ

, సోమవారం, 27 జనవరి 2025 (10:31 IST)
Vishwaxen-lady getup
మాస్ కా దాస్ విశ్వక్సేన్ తాజాగా లైలా అనే సినిమాలో నటిస్తున్నారు. ఆకాంక్ష శర్మ నాయిక, రామ్ నారాయణ్ దర్శకుడు సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్ అప్ బీట్ మోడ్రన్ స్టయిల్ బ్లెండ్ తో ఆకట్టుకుంది. ఇందులో విశ్వక్ సేన్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. సోను మోడల్ పాత్రతోపాటు హీరో పాత్ర పోషిస్తున్నారు.
 
బేబి పాట సందర్భంగా విశ్వక్ సేన్ కు ఓ ప్రశ్న ఎదురైంది. లేడీ గెటప్ పాత్రను కూకట్ పల్లి ఆంటీతో పాట రిలీజ్ సందర్భంగా ఓ వ్యక్తి అడిగాడు. అది సోషల్ మీడియాలో వైలర్ అయింది. కూకట్ పల్లి ఆంటీ అంటే వ్యభిచారిణి అన్నమాట. దానితో అటు సినిమా యూనిట్ పైనా, ఫిలిం ఇండస్ట్రీపైనా ఈ ప్రశ్న చికాకు పుట్టించింది. ఆ అడిగిన వ్యక్తి ఫి.ఆర్.కు సంబంధించిన వ్యక్తా? బయట వ్యక్తా? విశ్వక్ సేన్ కు చెందిన వ్యక్తా? అనేది డైలామాగా వుంది. సినిమా ఫంక్షన్ కు మీడియతోపాటు బయట వ్యక్తులుకూడా రావడం జరుగుతూనే వుంది. దానిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావడంలేదనేది సవాల్ గా మారింది.
 
కాగా, విశ్వక్ సేన్ కు తన సినిమా రిలీజ్ కు ముందు రకరకాల ప్రచార ఎత్తుగడం వేయడం అలవాటు. గతంలో ఫిలింనగర్ మెయిన్ రోడ్డుపైన హడావుడి చేసి సినిమాకు హైప్ తెచ్చేలా చేశారు. ఆ తర్వాత దానిపై విమర్శలు వచ్చాయి. అయినా మరో సినిమాలో మరో ఎత్తుగడ వేశాడు. ఇదంతా నాకు తెలీయకుండా జరిగిపోతుందంటూ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. కానీ లైలా విషయంలో మాత్రం ఇంకా ఆయన మాట్లాడేందుకు అవకాశం రాలేదు. త్వరలో ఆయన సమాధాన చెబుతాడేమో చూడాలి. అయితే ఆ అడిగిన వ్యక్తి మీడియాకు చెందిన వాడుకాదని సినిమాకు చెందిన కొందరు స్టేట్ మెంట్ ఇచ్చారు. మరి ఎవరనేది తెలియాటంటే విశ్వక్ సేన్ మరో ప్రచారసమయంలో చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగాథియా థర్డ్ సింగిల్ లో ఔషధ గుణాలు చెబుతున్న అర్జున్