Webdunia - Bharat's app for daily news and videos

Install App

సప్తగిరి ఇక ఎక్స్‌ప్రెస్సే... 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' రివ్యూ రిపోర్ట్

సప్తగిరి ఎల్‌ఎల్‌బి నటీనటులు: సప్తగిరి, కౌశిష్‌ బోహ్రా, సాయికుమార్‌, శకలక శంకర్‌, డా. శివప్రసాద్‌, డా. రవికిరణ్‌ తదితరులు, సాంకేతికత: సంగీతం: విజయ్‌ బుల్‌గానీ, నిర్మాత: డా. కె.రవికిరణ్‌, దర్శకత్వం: చర

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (14:48 IST)
సప్తగిరి ఎల్‌ఎల్‌బి నటీనటులు: సప్తగిరి, కౌశిష్‌ బోహ్రా, సాయికుమార్‌, శకలక శంకర్‌, డా. శివప్రసాద్‌, డా. రవికిరణ్‌ తదితరులు, సాంకేతికత: సంగీతం: విజయ్‌ బుల్‌గానీ, నిర్మాత: డా. కె.రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కావుల.
 
సహాయ దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి హాస్య నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న సప్తగిరి... 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' చిత్రంతో కథానాయకుడిగా మారారు. ఇప్పుడు అదే పేరుతో 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' అనే చిత్రంలో నటించిన ఆయన ఈసారి లాయర్లకు గౌరవం ఆపాదించే పాత్ర చేశానని చెప్పాడు. దర్శకుడిగా తొలి అవకాశంగా చరణ్‌ తీసుకున్న ఈ చిత్రం 'జూలీ ఎల్‌ఎల్‌బి' అనే బాలీవుడ్‌కు రీమేక్‌. గురువారమే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
అప్పుడే ఎల్‌ఎల్‌బి పూర్తిచేసి తనుండే ఊరిలో పంచాయితీ రచ్చబండపై కేసుల్ని ఇట్టే పరిష్కరించే సప్తగిరికి జిల్లా కోర్టులో చుక్కెదురవుతుంది. దాంతో హైదరాబాద్‌ వెళ్ళి మరింతగా రాటుదేలాలనే నిర్ణయానికి వస్తాడు. అప్పటికే మరదల్ని పెళ్లి చేసుకోవాలకున్న అతడి నిర్ణయాన్ని మేనమామ కాదనడంతో గొప్ప లాయర్‌గా పేరు తెచ్చుకుని వచ్చి పెళ్లిచేసుకుంటానని ఛాలెంజ్‌ విసురుతాడు. అలా వచ్చిన సప్తగిరికి ప్రఖ్యాత లాయర్‌ సాయికుమార్‌తో ఢీ కొట్టాల్సివస్తుంది. క్లోజ్‌ అయిన కేసును సప్తగిరి పిల్‌ వేసి అసలు దోషికి ఎలా శిక్ష పడేలా చేశాడన్నదే కథ.
 
విశ్లేషణ:
కమేడియన్‌గా పాపులర్‌ అయిన నటుడు సీరియస్‌ అంశాన్ని తీసుకుని ఎలా మెప్పిస్తాడనేది తెలుగులో సాహసమనే చెప్పాలి. దాన్ని నూటికి నూరు శాతం న్యాయం చేసిన పాత్రలో సప్తగిరి నటించాడు. 'జూలీ ఎల్‌ఎల్‌బి'ని పక్కన పెడితే సప్తగిరి చేసిన పాత్ర గతంలో హాస్యనటుడు పద్మనాభం 'పొట్టిప్లీడర్‌'తో రుజువు చేసుకున్నాడు. తనూ బిఎ ఎల్‌ఎల్‌బి చేసిన పద్మనాభం తన మరదలిని పెళ్లి చేసుకోవడానికి పడిన పాట్లతో పాటు జమిందార్‌ మర్డర్‌ కేసును టేకప్‌ చేసే సీనియర్‌ లాయర్‌ రావికొండలరావుతో పద్మనాభం జరిపిన వాగ్వివిదాదం క్లైమాక్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక సప్తగిరి ఎల్‌ఎల్‌బిలోనూ కారు ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు రైతుల్ని బిచ్చగాళ్ళుగా కోర్టును నమ్మించి కోటీశ్వరుడి మనవడ్ని కాపాడే ప్రయత్నంలో తిమ్మినిబమ్మిని చేసే ఉద్దండ లాయర్‌ సాయికుమార్‌కు చెమటలు పట్టించే పాత్రలో సప్తగిరి మెప్పించాడు.  
 
హాస్యనటుడు సెంటిమెంట్‌ పండించి మెప్పించగలడనేందుకు ఇందులో కొన్ని సన్నివేశాలతో నిరూపించాడు. రైతుల్ని బిచ్చగాళ్లుగా ట్రీట్‌ చేసే సన్నివేశంలో రైతుబిడ్డగా తన బాధను ఆవేశాన్ని ముఖకవళికల్లోనూ చేతల్లోనూ నిరూపించి మెప్పించాడు. ఇలా భిన్న కోణాల్ని ఆవిష్కరించి పాత్రకు న్యాయం చేశాడు. ముఖ్యంగా పతాక సన్నివేశంలో సాయికుమార్‌తో సాగే వాగ్వివిదాం, జడ్జితో జరిపే సంభాషణలు చిత్రానికి ఆయువుపట్టు. వీటిని చక్కగా పొందికగా కూర్చిన ఘనత పరుచూరి బ్రదర్స్‌దే. 
 
'రైతుల్ని ఇంకా చంపకండి... మీకు అన్నం పెడుతూ ప్రతిరోజూ చస్తూనే వున్నాడంటూ..' సన్నివేశపరంగా వచ్చే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. 'అన్యాయాన్ని గెలిపించి కోట్లు దాచుకున్నా అవి నీకు ఎందుకూ వుపయోగపడవు. కనీసం ఉప్పు కొనుక్కోవడానికి కూడా పనికిరావు. ఒక్కసారి న్యాయంతో గెలిచి చూడు..' అంటూ పతాక సన్నివేశంలో సప్తగిరి చేసిన వాదన హైలైట్‌గా నిలిచింది. సీనియర్‌ నటుడిగా సాయికుమార్‌ అవినీతి లాయర్‌గా పూర్తి న్యాయం చేశాడు. తన కిందవాడు ముట్టుకున్నా చేతికి మకిలి అంటుతుందన్నరీతిలో ఆయన చూపించే సీరియస్‌నెస్‌, హావభావాలు కొంగ్రొత్తగా వున్నాయి. 
 
అటువంటి నటుడితో సప్తగిరి ఎలా తలపడగలడు? అనే సందేశం ముగింపులో వచ్చినా.. అంతే ఆవేశంతో ఆలోచనతో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న మద్యపానాన్ని వేలెత్తి చూపించాడు. ఇలా ఆయన నటన, పరుచూరి మాటలకు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కు ఒక్కసారిగా జతకట్టి చిత్రాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్ళాయి. రణగొణ ధ్వనులతో అర్థం కాని పాయింట్లతో వస్తున్న కొన్ని చిత్రాలకు చెంపపెట్టుగా ఈ చిత్రం నిలుస్తుంది. డాక్టర్‌గా సమాజానికి ఏదో చేయాలన్న తపనతో డా. రవికిరణ్‌ చేసిన ప్రయత్నం అభినందనీయం. చూసిన ప్రతి ఒక్కరినీ ఆనందింపచేసి, ఆలోచించేట్లుగా చేయగల ఈ చిత్రం కమర్షియల్‌గా ఎంత మేరకు నిలుస్తుందనేది వేచి చూడాలి.
 
రేటింగ్ ‌: 3.5/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో బంగారం పంట... సింధు నదిలో పసిడి నిల్వలు!!

పుస్తకాల పురుగు పవన్ కళ్యాణ్ : రూ.లక్షల విలువ చేసే పుస్తకాలు కొన్న డిప్యూటీ సీఎం

లాస్‌ఏంజెలెస్‌లో ఆగని కార్చిచ్చు... 16కు పెరిగిన మృతులు...(Video)

సన్యాసినిగా మార్చేందుకు కుమార్తెను దానమిచ్చిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

రాజేంద్ర నగర్‌లో చిరుతపులి కలకలం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments