Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

దేవీ
శుక్రవారం, 21 నవంబరు 2025 (17:53 IST)
నటీనటులు : అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : వాజిద్ బేగ్, దర్శకుడు : సాయిలు కంపాటి, నిర్మాతలు : వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి, సంగీత దర్శకుడు : సురేష్ బొబ్బిలి
 
కథ: 
25 సంవత్సరాల తెలంగాణలో జరిగిన కథ.  ఓ మారుమూల గ్రామంలో బ్యాండ్ కొడుతూ జీవనం సాగించే యువకుడు రాజు (అఖిల్ రాజ్). అదే ఊరికి చెందిన అమ్మాయి రాంబాయి (తేజస్వి రావు) ని ప్రేమిస్తాడు. కానీ రాజు తండ్రి రమేష్ (శివాజీ రాజా)కు కొడుకు పని ఇష్టం వుండదు. అందుకే హైదరాబాద్ పంపాలనుకుంటాడు. ఇక రాంబాయి తండ్రి వెంకన్న (చైతూ జొన్నలగడ్డ) తన కూతురికి గవర్నమెంట్ సంబంధం చెయ్యాలని చూస్తాడు. భిన్న ధ్రువాలైన పెద్దల ఆలోచనలకు ప్రేమ జంట ఎటువంటి ట్విస్ట్ ఇచ్చారు. కథ ఎటువైపు సాగింది. ప్రేమికులు పడిన ఇబ్బందులు ఏమిటి? చివరికి ఏమయింది? అనేది కథ.
 
సమీక్ష:
కథ పరంగా చూస్తే, పరువు హత్యల నేపథ్యంగా అనిపిస్తుంది. గతంలో సుహాస్ నటించిన బ్యాండ్ మేళం గుర్తుకు వస్తుంది. అయితే రాజు వెడ్స్ రాంబాయి కథగా తీసుకుంటే తెలంగాణ లోని ఇల్లెందులో జరిగిన వాస్తవ కథ. అక్కడే సినిమాను షూట్ చేయాలని చిత్ర టీమ్ ప్రయత్నిస్తే ఊరంతా వ్యతిరేకించారు. ఆ తర్వాత వర్షాలు, తుఫాన్ తో సినిమా ఆలస్యమైంది. ఇలా అడ్డంకులను అధిగమించి సినిమా గా ఈటీవీ విన్ తెరముందుకు తీసుకువచ్చింది. 
 
ఇందులో హీరో హీరోయిన్లు వారి వారి నటనను వెలుగులోకి తీసుకువచ్చారు. అఖిల్ రాజ్, తేజస్విలు రాజు, రాంబాయి అనే లవర్స్ లా జీవించారు. మొత్తంగా చూస్తే ఇలాంటి కథ వుంటుందా? ఫాదర్ ఇలా వుంటారా? అనిపించేలా యూత్ కు అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు చాలా మంచి నటన కనబరిచారు. దర్శకుడు టేకింగ్ చాలా  క్లారిటీగా వుంది. తండ్రి చనిపోయినప్పుడు కమిటీ కుర్రాళ్ళులో నటించిన తేజస్వి మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. ఇలా ప్రతి ఒక్కరూ కథలో జీవించారనే చెప్పాలి. ఇందుకు దర్శకుడు పనితనం మెచ్చతగింది.
 
ఇక వీటితో పాటుగా అక్కడక్కడా వింటేజ్ కామెడీ సీన్స్ డీసెంట్ ఫన్ ని జెనరేట్ చేసాయి. శివాజీ రాజా తన పాత్రలో మంచి పెర్ఫామెన్స్ చేశారు. అలాగే నెగిటివ్ పాత్రలో చైతూ జొన్నలగడ్డ  మెస్మరైజ్ చేశాడు. ఇక వీరితో పాటుగా హీరో ఫ్రెండ్స్ గా కనిపించిన ఫ్రెండ్స్ తమ పాత్రల్లో బాగా చేశారు.
 
ఈ కథ ఇప్పటి జనరేషన్ కు ఆశ్చర్యం కలిగించకమానదు. తండ్రులు ఇలా వుంటే మా పరిస్థితి ఏమిటినేలా అమ్మాయిలు భయపడతారు. అబ్బాయిలు సంగతి సరే. బ్యాండ్ కొట్టుకునేవాడికి అమ్మాయిని ఇవ్వడమనేది చాలా కష్టమైన పని. అందుకే జరిగిన కథ ప్రకారం అతన్ని వెలివేస్తారు. కానీ సినిమాలో మరో కోణంలో చూపించారు. నిజ జీవిత ఘటనలే కాబట్టి మంచి ఎమోషన్ ఇందులో ఉంది. ఆ క్రమంలో కొంత సాగదీతగా కూడా అనిపిస్తుంది.
 
సంగీతపరంగా చక్కటి బీజియం దర్శకుడు ఇచ్చాడు.  ఈ సినిమా చూస్తున్న క్రమంలో ఒక పాయింట్ కి వచ్చేసరికి ఇలాంటి ప్రేమ కథలు చాలానే ఉంటాయి కదా అనిపిస్తుంది. కేవలం ఆ క్లైమాక్స్ పాయింట్ కోసం మిగతా సినిమా అంతా ఇంత సాగదీయాలా అనే ఫీల్ కలుగుతుంది. ఇంకా కొన్ని కొన్ని సీన్స్ రిపీటెడ్ గా సీరియస్ సన్నివేశాల్లో ఇరిటేట్ చేసే విధంగా అనిపిస్తాయి.
 
 ఈ టీవీ విన్  తీసుకున్న ఈ సినిమా నిర్మాణ విలువలు పర్వాలేదు. అక్కడక్కడా చిన్నపాటి వి ఎఫ్ ఎక్స్ లాంటివి కనిపించాయి. కానీ మిగతా సినిమా సెటప్ అంతా క్లీన్ గా ఉంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ బాగుంది. వాజిద్ బైగ్ కెమెరా వర్క్ బాగుంది. ప్రేమ సన్నివేశాల్లో కొంత మోతాదు తగ్గిస్తే బాగుండేది.  కొంచెం ఆ సీన్స్ ని తగ్గించుకుని ఉంటే ఈ సినిమా కొంచెం బెటర్ ఫీల్ ని ఆడియెన్స్ కి కలిగించి ఉండేది. లీడ్ జంట మధ్య ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అనే అంశాన్ని తాను బాగా చూపించారు. యదార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలు ఇప్పటి యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి. కొన్ని ఎమోషన్స్ క ట్టి పడేస్తాయి. దర్శకుడు చాలా కేర్ తీసుకుని చేసిన ఈ సినిమా. రచయిత కూడా కాబట్టి న్యాయం చేశాడు.
రేటింగ్ : 3/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్న మృతితో వితంతువుగా మారిన వదిన.. పెళ్లాడిన మరిది... ఎక్కడ?

Indian HAL Tejas jet- దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయిన భారత తేజస్ ఫైటర్ జెట్

కృష్ణానదిలో పాములు కాదు.. అవి పామును పోలిన చేపలు

కల్తీ నెయ్యి కేసు : ఫ్లేటు ఫిరాయించిన వైవీ సుబ్బారెడ్డి... తూఛ్.. అతను నా పీఏనే కాదు...

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు : దర్యాప్తులో విస్తుపోయే నిజాలు.... ఏంటవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments