Manchu Majoj, mounika, sivaji raja
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో సాంగ్ ను మంచు మనోజ్ ఫ్యామిలీ విడుదల చేసింది.
మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక మాట్లాడుతూ - మాకు ఇదొక ప్రత్యేక సందర్భంగా భావిస్తున్నాం. ఇలాంటి మీనింగ్ ఫుల్ సాంగ్, మనసుకు హత్తుకునే పాటను మా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈటీవీ విన్ వారికి కంగ్రాట్స్ చెబుతున్నాం. ఇలాంటి అర్థవంతమైన సినిమాలు మరెన్నో మీరు ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నాం. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ - నా కెరీర్ లో 2.ఓ ఈటీవీ విన్ లో ఉస్తాద్ అనే షో తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత భైరవం, మిరాయ్ లాంటి హిట్ సినిమాలు దక్కాయి. మంచి కంటెంట్ తో మూవీస్, షోస్ చేస్తూ ఈటీవీ విన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ గురించి నాకు తెలుసు. రెండేళ్లుగా ఈ టీమ్ "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా కోసం కష్టపడుతున్నారు.
ఒక పల్లెటూరిలో జరిగిన యదార్ధ ఘటన ఈ సినిమా. జరగకూడని ఘటన అది. ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే ఎంటర్ టైనింగ్ మూవీ చేశారు. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా కూడా లైట్ మూవ్ మెంట్స్ తో వెళ్తూ హెవీ ఎమోషన్ తో పూర్తవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అన్ని అవార్డ్స్ ఈ సినిమాకు వస్తాయి. సినిమా సక్సెస్ మీట్ కు వచ్చి డీటెయిల్డ్ గా మాట్లాడుతా.
జీవితంలో కష్టపడతా, ఎవరినీ మోసం చేయను, బాగా చూసుకుంటా అనే మాటను మౌనికకు ఇచ్చాను. మీరూ మిమ్మల్ని నమ్మి మీతో వచ్చిన వారి చేయిని జీవితంలో వదిలిపెట్టకండి. ఒక ప్రేమ జంటకు జరిగిన అన్యాయాన్ని ఒక ఊరు ఊరంతా బయటకు రాకుండా తొక్కిపెట్టిందంటే అది ఎంత దారుణమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్టర్ సాయిలుకు బెదిరింపు కాల్స్ వస్తాయి. అప్పుడు నీకు సపోర్ట్ గా నేనుంటా. ఇలాంటి పాయింట్ ను డైరెక్టర్ సినిమాగా చేశాడంటే అతనికి హ్యాట్సాఫ్. ఇలాంటి మంచి సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.