Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

Advertiesment
Blasting Roar from Akhanda 2

చిత్రాసేన్

, శుక్రవారం, 24 అక్టోబరు 2025 (18:23 IST)
Blasting Roar from Akhanda 2
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ అఖండ 2 నుంచి బ్లాస్టింగ్ రోర్ అంటూ ఓ సాలిడ్ అప్డేట్‌ను వదిలారు. ఈ బ్లాస్టింగ్ రోర్ వీడియో గ్లింప్స్‌తో బాలయ్య ప్రతినాయకుడితో వార్నింగ్ ఇస్తూ ఆవేశంగా పలికే డైలాగ్ లు ఆయన ఆయన మార్క్ ను తెలియజేశాయి. సౌండ్ కంట్రోల్ లోపెట్టుకో ఏ సౌండ్ కు నవ్వుతానో.. ఏ సౌండ్ కు నరుకుతానో నాకే తెలియదు కొడకా.. అంటూ వార్నింగ్ తో బాలయ్య గర్జన సింహంలా వినిపించగా, ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ బ్లాక్స్ థమన్ సౌండ్ తో అదిరిపోయాయి. చివర్లో ఆయన కాలు మోపగానే గుర్రాలు భయంతో దూకడం పక్కా మాస్ ఎలివేషన్ ఇచ్చాడు బోయపాటి. 
 
ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తుండగా.. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా అఖండ 2: తాండవం.  ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ద్వారా లెజెండ్ అఖండ పాత్రను పరిచయం చేసిన ఫస్ట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ మరో పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ అఖండ 2: బ్లాస్టింగ్ రోర్ టైటిల్ తో మరో ఎలక్ట్రిఫైయింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో బాలకృష్ణ పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ తో అదరగొట్టారు.
 
రామ్-లక్ష్మణ్ మాస్టర్‌ల యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉండగా, ఎస్. థమన్ అందించిన బిజిఎమ్ పవర్‌ఫుల్‌గా ఉంది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత స్థాయిలో వున్నాయి. ఈ కొత్త టీజర్‌తో, అఖండ 2: తాండవం కోసం అంచనాలు మరింత పెరిగాయి.
 
ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ