MM Keeravani, Roshan Kanakala, Sakshi Madolkar, Sandeep Raj, TG Vishwa Prasad
మోగ్లీ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సయ్యారేను మేకర్స్ విడుదల చేసి మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు. కాల భైరవ ఆర్కెస్ట్రేషన్ తో వినసొంపైన ట్యూన్ ను కంపోజ్ చేశారు. చంద్ర బోస్ హార్ట్ టచ్చింగ్ లిరిక్స్ అందించారు. ఈ పాట చెవిటి, మూగ అమ్మాయి, సౌండ్ నిరోధించే డివైజ్ ని ధరించి తన వినికిడి సామర్థ్యాన్ని త్యాగం చేయడానికి నిర్ణయించుకున్న అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ఎమోషనల్ అతను ఆమెకు ఒక లేఖ రాస్తాడు, ఆమెను ప్రేమిస్తానని ప్రామిస్ చేస్తాడు.
ఐశ్వర్య దారురితో కలసి కాల భైరవ స్వయంగా ఈ పాటకు సోల్ ఫుల్ వోకల్స్ అందించాడు. రోషన్ కనకాల మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సాక్షి మడోల్కర్‌తో అతని ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎట్రాక్టివ్ గా వుంది.
అద్భతమైన కంపోజిషన్, అర్థవంతమైన సాహిత్యం, సోల్ ఫుల్ వోకల్స్ తో సయ్యారే సాంగ్ సినిమా మ్యూజిక్ జర్నీకి పర్ఫెక్ట్ బిగినింగ్.
ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటించగా, హర్ష చెముడు కీలక పాత్ర పోషిస్తున్నారు.
బబుల్గమ్ చిత్ర ఫేమ్ హీరో రోషన్ కనకాల తన సెకండ్ మూవీ మోగ్లీ 2025 తో వస్తున్నారు. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన మోగ్లీ 2025 అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ చిత్రానికి రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్క్రీన్ ప్లేను రామ మారుతి ఎం, రాధాకృష్ణ రెడ్డి రాశారు. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా, కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్‌గా, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మోగ్లీ 2025 డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది.