Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Advertiesment
Ram Charan at Hyderabad Airport

చిత్రాసేన్

, శుక్రవారం, 24 అక్టోబరు 2025 (13:36 IST)
Ram Charan at Hyderabad Airport
పెద్ది చిత్రం తదుపరి షెడ్యూల్ శ్రీలంకలో జరగనున్న విషయం తెలిసిందే. నేడు రామ్ చరణ్ హైదరాబాద్  ఎయిర్ పోర్ట్ లో బ్లాక్ లో దిగారు. ఎయిర్ పోర్ట్ లో దర్శకుడు బుజ్జిబాబు, సినిమాటోగ్రాఫర్ ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవలే బుజ్జిబాబు తిరుపతిలో కూడా సినిమా అప్ డేట్ వివరించారు. శ్రీలంక షెడ్యూల్ తర్వాత మొదటి సింగిల్ ప్రకటన చేస్తామని తెలిపారు.
 
గేమ్ ఛేంజ‌ర్ తర్వాత రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బుచ్చిబాబు సాన చిత్రం పెద్దిపై ఆశలు పెట్టుకున్నారు. ఇందులోని పాత్ర కోసం చాలా మేకోవర్ అయ్యాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా కోసం చ‌ర‌ణ్ చాలా కష్టపడ్డాడు. మెగా అభిమానులకు దర్శకుడు బుచ్చిబాబు  ఇటీవల షెడ్యూల్ పూర్తిచేసుకుని సొంత నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, పెద్ది సినిమాలో  యాక్షన్ సన్నివేశాల్లో చరణ్ అద్భుతంగా నటించారనీ, ఇది మరో హిట్ సినిమా అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జానీ మాస్టర్ ఆధ్వర్యంలో రామ్ చరణ్, జాన్వీకపూర్ పై పాటను శ్రీలంకలో తీయనున్నట్లు తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్