Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

Advertiesment
Venu Udugula, Akhil, Tejaswini, Sailu Kampati, Bunny Vas

చిత్రాసేన్

, బుధవారం, 29 అక్టోబరు 2025 (15:54 IST)
Venu Udugula, Akhil, Tejaswini, Sailu Kampati, Bunny Vas
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు.

సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర రిలీజ్ డేట్ కార్యక్రమం నిర్వహించారు.
 
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ - రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూశాను. ఇది నా మనసుకు హత్తుకుంది. కొందరి లైఫ్ లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా చేశారు. ఇది కాల్పనిక కథ అయితే మనం ఆ దర్శకుడి ఊహకు ఆశ్చర్యపోయేవాళ్లం. ఇలా ఎలా ఆలోంచించారు అనుకునేవాళ్లం. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక ఎమోషనల్ ఫీల్ తో వస్తారు. అఖిల్ రాజు పాత్రలో బాగా నటించాడు. తేజస్విని తెలుగు అమ్మాయి. ఈ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్, పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతన్య ఒక మంచి రోల్ చేశాడు. అతనికి నటుడిగా మంచి పేరు తెచ్చే మూవీ అవుతుంది. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆయనతో పాటు ఈటీవీ విన్ వారికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
నటుడు చైతు జొన్నలగడ్డ మాట్లాడుతూ - రాజు వెడ్స్ రాంబాయి పక్కా తెలంగాణ సినిమా. తెలంగాణ నేటివిటీని, ఇక్కడి ప్రజల జీవితాలను ఈ చిత్రంలో చూస్తాం. తెలంగాణ నేటివిటీని ఇంత పర్పెక్ట్ గా చూపించిన సినిమా మరొకటి లేదు. ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.
 
డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ - 2016 నుంచి ఈ  కథ పట్టుకుని తిరుగుతూ ఉన్నాను. ఒకే ఒక నెరేషన్ లో వేణు ఊడుగుల మనం సినిమా చేస్తున్నాంరా తమ్ముడు అన్నారు. ఈటీవీ విన్ వారిని అప్రోచ్ అయితే వాళ్లకూ కథ నచ్చింది. అలా రాజు వెడ్స్ రాంబాయి సినిమా టేకాఫ్ అయ్యింది. సాయికృష్ణ, నితిన్ నాకు బ్రదర్స్ లా సపోర్ట్ చేశారు. వేణు అన్న తోడునీడలా ఉన్నారు. సురేష్ బొబ్బిలి అన్న మ్యూజిక్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అన్నారు.
 
ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ - ఖమ్మం, వరంగల్ మధ్య జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్ర కథను దర్శకుడు సాయిలు రాసుకున్నాడు. ప్రేమతో కూడిన విషాధభరితమైన ఈ సంఘటన ఆ ఊర్లోనే జరిగి అక్కడే సమాధి అయ్యింది. దాన్ని బేస్ చేసుకుని సాయిలు ఒక మంచి స్క్రిప్ట్ రాశాడు. ఈ కథ విన్నప్పుడే కదిలించింది. ఈ కథను ఎంటర్ టైనింగ్, మాస్ అప్పీల్ ఉండేలా దర్శకుడు సాయిలు స్క్రిప్ట్ రాశాడు. ఈటీవీ విన్ వారి వల్లే నేను ప్రొడ్యూసర్ ను అయ్యాను.  7జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్ఎక్స్ 100, బేబి లాంటి చిత్రాల్లా తెలుగు ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. నా డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయబోతున్నా. ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అన్నారు
 
హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ - రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో రాంబాయి క్యారెక్టర్ తో మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా, ఈ క్యారెక్టర్ నా మనసుకు ఎంతో దగ్గరయ్యాయి. సినిమా చూస్తున్నంత సేపు మీరు ఒక ఎమోషన్ కు గురవుతారు, మూవీని ఇష్టపడతారు. తెలుగు ఆడియెన్స్ కు మా మూవీ బాగా నచ్చుతుంది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ వారికి, మా డైరెక్టర్ సాయిలు, వేణు గారికి థ్యాంక్స్. అన్నారు.
 
హీరో అఖిల్ మాట్లాడుతూ - నాకు సినిమా అంటే పిచ్చి. యాంకర్ గా పనిచేశాను. అక్కడి నుంచి ఇప్పుడు హీరోగా మీ ముందుకు వస్తున్నా. నాలాగే మా డైరెక్టర్ సాయిలు గారికి సినిమా అంటే పిచ్చి. నన్ను హీరోగా పరిచయం చేస్తున్న  వేణు గారికి, ఈటీవీ విన్ వారికి థ్యాంక్స్. నవంబర్ 21న మా మూవీ చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్