Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్టర్‌ హోమానంద్' మంచి ప్రయత్నమే.. కానీ... రివ్యూ రిపోర్ట్

సినిమా రంగంపై ఆసక్తి పెంచుకుని ఎలాగైనాహీరో కావాలని హోమానంద్‌ చేసిన ప్రయత్నమే మిస్టర్‌ హోమానంద్‌. తన పేరునే టైటిల్‌గా పెట్టుకుని హీరోగా తనే చేస్తూ రూపొందించాడు. ఏడాదికిపైగా సినిమాను చేసి విడుదల చేసిన ఈ

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (16:28 IST)
మిస్టర్ హోమానంద్ నటీనటులు: హోమానంద్‌, పావని, ప్రియాంక శర్మ, ప్రభాకర్‌, గుండు హనుమంతరావు, సుమన్‌, అదుర్స్‌ రఘు, గుండు మురళి, తడివేలు, చిట్టిబాబు తదితరులు; సాంకేతికత: సంగీతం: బోలే షావలి, నిర్మాత: హోమానంద్‌, దర్శకత్వం: జై రామ్‌ కుమార్‌.
 
సినిమా రంగంపై ఆసక్తి పెంచుకుని ఎలాగైనాహీరో కావాలని హోమానంద్‌ చేసిన ప్రయత్నమే మిస్టర్‌ హోమానంద్‌. తన పేరునే టైటిల్‌గా పెట్టుకుని హీరోగా తనే చేస్తూ రూపొందించాడు. ఏడాదికిపైగా సినిమాను చేసి విడుదల చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదలవుతుంది. ఈ సందర్భంగా ముందుగా ప్రివ్యూ నిర్వహించారు. అదెలా వుందో చూద్దాం.
 
కథ:
పిసినారి అయిన హోమానంద్‌ తన తండ్రి సొంతింటి కల నెరవేర్చడానికి పూనుకుంటాడు. తన పనిచేసే కంపెనీ బాస్‌ కుమార్తెను ప్రేమిస్తాడు. తనూ ఇతన్ని ప్రేమిస్తుంది. పెల్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అలాంటి సమయంలో ఇతని ప్రవర్తన తేడాగా అనిపించడంతో అతన్ని కాదనుకుంటుంది. విషయం తెలుసుకున్న హోమానంద్‌ తనెందుకు అలా ప్రవర్తించాననేది వెల్లడిస్తాడు. అంతా సెట్టయి పెళ్లి చేసుకునేముందు తను కొన్న కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తాడు. అందులో ఓ దెయ్యం తిష్టవేస్తుంది. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? అసలు దెయ్యం ఎందుకు అలా తిష్టవేసిందనేది? మిగిలిన కథ.
 
విశ్లేషణ:
మిస్టర్‌ హోమానంద్‌కు ఇది తొలి సినిమా. అది అతని పాత్రలోనే కన్పిస్తుంది. నటనలో శిక్షణ తీసుకున్నా కొన్ని సందర్భాల్లో ఇంకాస్త మెరుగుపరుచుకుంటే బాగుండేది. అయితే సన్నివేశపరంగా గే పాత్రలో ఒదిగిపోయాడు. డాన్స్‌ కూడా బాగానే చేశాడు. డైలాగ్‌ డెలివరీ పర్వాలేదు. నటిగా పావని పర్వాలేదనిపిస్తుంది. ఇక దెయ్యం పాత్రలో ప్రియాంక శర్మ భయపెట్టే ప్రయత్నం చేసింది. ఇక హీరో స్నేహితులుగా నటించిన నలుగురు ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేశారు. ఆ తరహాలోనే అదుర్స్‌ రఘు, గుండు మురళి, తడివేలు, చిట్టిబాబు తమదైన శైలిలో మెప్పించారు.
 
దర్శకుడు కొత్తవాడయినా హార్రర్‌ కాన్సెప్ట్‌ను తీసుకుని వినోదం పడించాలని ప్రయత్నించాడు. అందుకు సరైన కసరత్తు చేస్తే చిత్రం మరింత స్థాయిలోకి వెళ్ళేది. హర్రర్‌ కామెడీ అనేవి ఒక కత్తికి రెండు వరలు లాంటివి. వాటిని పండించాలంటే తగిన నటీనటులు ప్రధానం. భయపెట్టే సన్నివేశాల్లో రీరికార్డింగ్‌ కీలకం. దాన్ని  బోలేషావళి కృషి చేశాడు. సంభాషణలపరంగా కొత్తగా అనిపించకపోయినా కథకు తగినవిధంగా దర్శకుడు రాసుకున్నాడు. చనిపోయిన గుండు హనుమంతరావు, రాజమౌళిలను ఒక్కసారిగా చూసే అవకాశం ఈ చిత్రం ద్వారా కలిగింది.
 
మొదటి భాగమంతా హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌తోనే సాగుతూ హీరో కొత్త ఇంటిలోకి ప్రవేశించడంతో దెయ్యం వుందనే ట్విస్ట్‌తో ఇంటర్‌వెల్‌ వస్తుంది. ఇక ఆ తర్వాత నుంచి దాన్నుంచి ఎలా బయటపడ్డాడనేది కథ అయితే.. ముగింపులో మరో ట్విస్ట్‌ ఇస్తాడు. వైద్యరంగానికి చెందిన బ్రెయిన్‌ మార్పిడి అనే అంశం కొత్తది. ఆ సాఫ్ట్‌వేర్‌ను డాక్టర్‌ ప్రియాంకశర్మ తయారుచేసి ప్రపంచానికి మంచి చేయాలనుకునే క్రమంలో చనిపోతుంది.

ఆ పాయింట్‌ చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. అయితే కొత్త హీరోగా కొత్త దర్శకుడిగా చేసే సమయంలో ఇంత భారీ కథను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తే బాగుండేది. దెయ్యం పాత్రతో కామెడీ చేయించే స్కోపున్న దాన్ని దర్శకుడు సరిగ్గా వుపయోగించుకోలేకపోయాడు. క్లైమాక్స్‌ రొటీన్‌గా అనిపించినా కొత్తగా చూపే ప్రయత్నం చేశాడు. విలన్‌గా ప్రభాకర్‌ నటించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇటువంటి చిత్రాన్ని తీయడం మంచి ప్రయత్నమే కానీ ఇంకాస్త కసరత్తు చేస్తే బాగుండేది. అయితే తీసేసే సినిమా మాత్రం కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో బంగారం పంట... సింధు నదిలో పసిడి నిల్వలు!!

పుస్తకాల పురుగు పవన్ కళ్యాణ్ : రూ.లక్షల విలువ చేసే పుస్తకాలు కొన్న డిప్యూటీ సీఎం

లాస్‌ఏంజెలెస్‌లో ఆగని కార్చిచ్చు... 16కు పెరిగిన మృతులు...(Video)

సన్యాసినిగా మార్చేందుకు కుమార్తెను దానమిచ్చిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

రాజేంద్ర నగర్‌లో చిరుతపులి కలకలం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments