Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి న‌మ్ర‌త ఏమ‌న్నారో తెలుసా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల భ‌ర‌త్ అనే నేను సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకోవ‌డం తెలిసిందే. ఇప్పుడు త‌న కెరీర్‌లో ముఖ్య‌మైన 25వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌

Advertiesment
మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి న‌మ్ర‌త ఏమ‌న్నారో తెలుసా..?
, సోమవారం, 18 జూన్ 2018 (15:22 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల భ‌ర‌త్ అనే నేను సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకోవ‌డం తెలిసిందే. ఇప్పుడు త‌న కెరీర్‌లో ముఖ్య‌మైన 25వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... గ‌త కొన్ని రోజులుగా మ‌హేష్ బాబు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఈ వార్త‌లపై మ‌హేష్ బాబు భార్య న‌మ్ర‌త క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే... మ‌హేష్ త‌న‌ 25వ సినిమా లుక్‌ టెస్ట్‌ కోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీంను కలవడానికే ముంబైలో ఉండాల్సి వచ్చింది. అంతేకానీ... ఏ బాలీవుడ్‌ నిర్మాతను కలవలేదని ఆమె వెల్లడించారు. అదీ..సంగ‌తి. ఇక 25వ సినిమా విష‌యానికి వ‌స్తే... ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ ఈ చిత్రం షూటింగ్ ఈరోజే ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెత్త వేశాడని అనుష్క శర్మ కేకలు-అంతే నెటిజన్లు ఇలా తిట్టిపోస్తున్నారు.. అవసరమా?