Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెత్త వేశాడని అనుష్క శర్మ కేకలు-అంతే నెటిజన్లు ఇలా తిట్టిపోస్తున్నారు.. అవసరమా?

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఆమె భర్త విరాట్ కోహ్లీలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అనుష్క, విరాట్ కలిసి కారులో వెళ్తుండగా, పక్కనే కారులో వెళ్తున్న అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి ప్లాస్టిక్‌ క

Advertiesment
చెత్త వేశాడని అనుష్క శర్మ కేకలు-అంతే నెటిజన్లు ఇలా తిట్టిపోస్తున్నారు.. అవసరమా?
, సోమవారం, 18 జూన్ 2018 (15:01 IST)
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఆమె భర్త విరాట్ కోహ్లీలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అనుష్క, విరాట్ కలిసి కారులో వెళ్తుండగా, పక్కనే కారులో వెళ్తున్న అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి ప్లాస్టిక్‌ కవరును రోడ్డుపై పడేశాడు. అది గమనించిన అనుష్క కారు ఆపి మరీ అతనిపై మండిపడింది. రోడ్డుపై ఎందుకు ప్లాస్టిక్ వేస్తున్నారు. డస్ట్‌బిన్ ఉపయోగించమని కేకలు పెట్టింది. 
 
అనుష్క అర్హాన్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోను విరాట్ కోహ్లీ ట్విట్టర్లో పోస్టు చేశాడు. వీళ్లా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేది? ఎవరైనా చెత్త పడేయడం చూసినప్పుడు మీరూ ఇలానే వారిని ప్రశ్నించండి. అవగాహన కల్పించండంటూ పిలుపునిచ్చాడు. 
 
అయితే ఆ పిమ్మట అర్హాన్ సింగ్ ఫేస్‌బుక్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. కానీ అనుష్క, విరాట్‌ తన పట్ల ప్రవర్తించిన తీరును విమర్శించారు. తాను  రోడ్డుపై పడేసిన చెత్త కంటే అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. సెలబ్రిటీ అయివుండి రోడ్డున పోయే వ్యక్తిలాగా కేకలు పెట్టిందని మండిపడ్డాడు. అర్హాన్ తల్లి కూడా తన కుమారుడి పట్ల అనుష్క శర్మ కేకలు పెట్టడం సబబు కాదని తెలిపింది.
 
అంతేగాకుండా నెటిజన్లు కూడా అనుష్క శర్మపై మండిపడుతున్నారు. మైదానంలో నోటికొచ్చినట్లు తిట్టే భర్తను కూడా కంట్రోల్‌లో పెట్టమని సూచిస్తున్నారు. చెత్తపడేశాడని అనుష్క తిట్టడంలో తప్పులేదు. కానీ ఆ వ్యక్తి వివరాలు షేర్‌ చేయాల్సిన అవసరం ఏముందని మండిపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిషా కౌర్‌తో సన్నీ దంపతులు.. అర్ధనగ్నంగా ఇదేంటి? ఛీ కొడుతున్న నెటిజన్స్